Shukra Uday 2022: జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు.. సంపద, లగ్జరీ లైఫ్, ప్రేమ, అందం మరియు ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా వర్ణించబడింది. మీ జాతకంలో శుక్రుడు శుభస్థానంలో అతడి లైఫ్ బిందాస్ గా ఉంటుంది. గత అక్టోబరు 2న శుక్రుడు అస్తమించడం వల్ల వివాహాలు వంటి శుభకార్యాలన్నీ నిలిపివేయబడ్డాయి. దీంతోపాటు దీని చెడు ప్రభావం కొన్ని రాశులపై పడింది. నవంబరు 20న శుక్రుడు (Shukra Uday 2022) ఉదయించాడు. దీంతో కొందరికి మంచి రోజులు మెుదలయ్యాయి. శుక్రుడు ఉదయం వల్ల ఏరాశులవారికి లాభం కలుగుతుందో తెలుసుకుందాం.
శుక్రుడు ఉదయం ఈ రాశులకు శుభప్రదం
వృషభం (Taurus): వృషభ రాశి వారికి శుక్రుడు ఉదయించడం చాలా శుభప్రదం. వృషభ రాశికి అధిపతి శుక్ర గ్రహం. దీంతో ఈ రాశి వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పెళ్లికానీ యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. కెరీర్ లో పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
తుల (Libra): తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి శుక్రుని ఉదయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. తద్వారా తులరాశి వ్యక్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి శుక్రుడు ఉదయం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. జీతంలో పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ముఖ్యంగా పార్టనర్‌షిప్‌తో పనిచేసే వారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also read: Rahu Transit: 2023 అక్టోబరు వరకు మేషరాశిలో రాహువు... ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి