T20 WC 2021: మెంటార్‌గా ధోని పని మెుదలెట్టేశాడు...వీడియో వైరల్

T20 WC 2021: టీ20 వరల్డ్ కప్2021లో భాగంగా...ధోని మెంటార్ గా తన పని మెుదలుపెట్టాడు. తన శిష్యుడైన రిషబ్ పంత్ కు కీపింగ్ లో మెలకువలు నేర్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 07:39 PM IST
T20 WC 2021: మెంటార్‌గా ధోని పని మెుదలెట్టేశాడు...వీడియో వైరల్

MS Dhoni trains Rishabh Pant: టీ20 ప్రపం‍చకప్‌ 2021(T20 World Cup 2021) భాగంగా...టీమిండియా అక్టోబరు 24న పాకిస్తాన్ ను ఢీకొట్టబోతుంది. ఈ నేపథ్యంలో భారత్ జట్టుకు మెంటార్ గా నియమించిన ధోని(MS Dhoni) తన పని మెుదలు పెట్టినట్లు తాజా వీడియో ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రెండు వార్మప్ మ్యాచ్ లలో విజయం సాధించి..భారత్ మంచి జోరు మీదుంది. ఆస్ట్రేలియాతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా.. రిషబ్‌ పంత్‌(Rishab pant) తన గురువైన ధోని నుంచి విలువైన సలహాలు, సూచనలు పొందాడు. ఈ నేపథ్యంలో ధోని.. పంత్‌కు ఇచ్చిన ట్రెయినింగ్‌ డ్రిల్‌ వీడియోపై స్పందించాడు.

'యూఏఈలో పిచ్‌లో స్లోగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంత్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు వివిధ యాంగిల్స్‌లో బంతులు విసిరాను. మోచేతి కింది నుంచి బంతులు విసురుతుంటే.. పంత్‌ వాటిని అందుకొని స్టంపింగ్‌ చేశాడు. ఇలా చేస్తే స్పిన్నర్ల బౌలింగ్‌లో మరింత వేగంగా స్టంప్‌ అవుట్‌ చేసే అవకాశం పెరుగుతుంది.'' అంటూ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. 

Also read: Virat Kohli Bowling Video: బ్యాటింగ్ కాదు..బౌలింగ్ తో మెరిసిన కోహ్లీ.. వీడియో వైరల్

2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పంత్‌(Rishab pant) అనతికాలంలోనే టీమిండియాకు అన్ని ఫార్మాట్లలోనూ ప్రధాన వికెట్‌ కీపర్‌గా ఎదిగాడు. ధోని రిటైర్మెంట్‌ తర్వాత తన దూకుడైన బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌లోనూ సత్తా చాటుతూ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. టీమిండియా తరపున పంత్‌ 25 టెస్టుల్లో 1549 పరుగులు.. 18 వన్డేల్లో 529 పరుగులు.. 33 టి20ల్లో 512 పరుగులు సాధించాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News