Vedaant Madhavan: డానిష్​ ఓపెన్ స్విమ్మింగ్​​ ఈవెంట్​లో.. మాధవన్ కుమారుడికి సిల్వర్ మెడల్

Vedaant Madhavan: నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్​లో అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. దీంతో మాధవన్ పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 07:46 PM IST
  • స్టార్​ హీరో మాధవన్​ కుమారుడి ఘనత
  • డానిష్​ ఓపెన్ స్విమ్మింగ్​​లో సిల్వర్
Vedaant Madhavan: డానిష్​ ఓపెన్ స్విమ్మింగ్​​ ఈవెంట్​లో.. మాధవన్ కుమారుడికి సిల్వర్ మెడల్

Danish Open 2022: నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ (Vedaant Madhavan) స్విమ్మింగ్​లో రాణిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు. తాజాగా డెన్మార్క్​లోని కోపెన్‌హాగన్​లో జరిగిన డానిష్​ ఓపెన్​ స్విమ్మింగ్​ పోటీల్లో (Danish Open 2022) సిల్వర్ సాధించి దేశం గర్వపడేలా చేశాడు. ఇదే ఈవెంట్​లో మరో విభాగంలో సాజన్​ ప్రకాశ్ (Sajan Prakash) బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై స్విమ్మింగ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించగా.. పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో వేదాంత్ రజత పతకం సాధించాడు.

కుమారుడు సిల్వర్ సాధించటంతో.. పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నారు మాధవన్ (Actor Madhavan). ఈ సందర్భంగా పలువురికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ''మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో స్విమ్మర్లు సాజన్, వేదాంతలు కోపెన్‌హాగన్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో భారత్‌కు వరుసగా స్వర్ణం, రజతం అందించారు. కోచ్ ప్రదీప్ సార్, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) మరియు ANSAకి చాలా ధన్యవాదాలు. మేము చాలా గర్విస్తున్నాము" అంటూ మాధవన్ ట్వీట్ చేశాడు.

అంతేకాకుండా తన కొడుకు పతకం అందుకుంటున్న వీడియోను ఈ సందర్భంగా ఇన్ స్టాలో షేర్​ చేశారు మాధవన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  సెలబ్రిటీలు, మాధవన్​ ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా నటి శిల్పా శెట్టి ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by R. Madhavan (@actormaddy)

Also Read: IPL Catches Record: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 వికెట్ కీపర్లు వీళ్లే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News