IPL 2024 Points Table: ఢిల్లీ దెబ్బకు టాప్ ఫ్లేస్ కోల్పోయిన చెన్నై.. అగ్రస్థానం ఎవరిదంటే?

IPL 2024 Updates: ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన షాక్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది. నిన్న జరిగిన మ్యాచుల్లో గుజరాత్, ఢిల్లీ గెలవడంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 1, 2024, 04:14 PM IST
IPL 2024 Points Table: ఢిల్లీ దెబ్బకు టాప్ ఫ్లేస్ కోల్పోయిన చెన్నై.. అగ్రస్థానం ఎవరిదంటే?

IPL 2024 Points Table Updates: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమై పది రోజులు దాటింది. మార్చి 31 వరకు మెుత్తంగా 13 మ్యాచులు జరిగాయి. శనివారం(మార్చి 30) వరకు అగ్రస్థానంలో ఉంటూ వచ్చిన చెన్నై వైజాగ్ మ్యాచ్ లో ఓడిపోవడంతో టాప్ ఫ్లేస్ గల్లంతు అయింది.  ఈ నేపథ్యంలో తొలి స్థానంలోకి ఎవరు వచ్చారు, సన్ రైజర్స్ హైదరాబాద్ స్థానం ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం. ఐపీఎల్‌లో సోమవారం (ఏప్రిల్ 01) ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.

ఆదివారం జరిగిన మ్యాచ్ లో రుతురాజ్ సేన ఓడిపోవడంతో రెండో స్థానానికి దిగజారింది. ఇక రెండో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ అగ్రస్థానానికి ఎగబాకింది. కేకేఆర్ ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లు సాధించి +1.047 నెట్ రన్ రేట్ తో టాప్ లో నిలిచింది. ఇక సీఎస్కే మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిచి +0.976 రన్ రేట్ సెకండ్ ఫ్లేస్ లో కొనసాగుతోంది. మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉంది. సంజూ సేన ఆడిన రెండో మ్యాచుల్లో గెలిచి +0.800 రన్ రేట్‌ను కలిగి ఉంది. ఆదివారం మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ గెలవడంతో ఏకంగా ఎనిమిదో స్థానంలో నుంచి నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచింది. 

Also read: MI Vs RR: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. రాజస్థాన్ తో మ్యాచ్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ.. ఇందులో నిజమెంత?

తెలుగు టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచి +0.204 నెట్ రన్ రేట్ తో ఐదో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో రాహుల్ సేన ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన రెండు మ్యాచుల్లో ఒకటి గెలిచి +0.025 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది. ఆదివారం చెన్నైపై ఢిల్లీ గెలవడంతో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. రిషభ్ సేన ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. ఇక చివరి స్థానంలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై జట్టు ఉంది. ముంబై ఆడిన రెండు మ్యాచుల్లో ఓడి అట్టడుగు స్థానంలో నిలిచింది. 

Also Read: IPL 2024 Playoff Predictions: అందరికీ షాక్ ఇస్తున్న కుంబ్లే ప్లే ఆఫ్ అంచనాలు, ఆ జట్లకు నో ఛాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News