అజారుద్దీన్‌కి అంబటి రాయుడు స్ట్రాంగ్ కౌంటర్.. కేటీఆర్‌కి విజ్ఞప్తి

మొహమ్మద్ అజారుద్దీన్‌(Mohammad Azharuddin)కి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు(Ambati Rayudu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తనను అజారుద్దీన్ 'ఫ్రస్ట్రేటెడ్ క్రికెటర్'(frustrated cricketer) అని వ్యాఖ్యానించడంపై అంబటి రాయుడు ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో(Hyderabad Cricket Association) భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించాడు.

Last Updated : Nov 25, 2019, 11:56 AM IST
అజారుద్దీన్‌కి అంబటి రాయుడు స్ట్రాంగ్ కౌంటర్.. కేటీఆర్‌కి విజ్ఞప్తి

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టేన్.. ప్రస్తుత హెచ్‌సిఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజారుద్దీన్‌(Mohammad Azharuddin)కి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు(Ambati Rayudu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తనను అజారుద్దీన్ ''ఫ్రస్ట్రేటెడ్ క్రికెటర్''(frustrated cricketer) అని వ్యాఖ్యానించడంపై అంబటి రాయుడు ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో(Hyderabad Cricket Association) భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని, దానిని సరిదిద్దే గొప్ప అవకాశం మీకు దక్కింది కనుక అక్కడి అవినీతిని అరికట్టే పనిపై దృష్టి సారించండి కానీ ఇలా పర్సనల్ కామెంట్స్ చేసి మ్యాటర్ పర్సనల్ చేయొద్దని హితవు పలికాడు. విషయం మన ఇద్దరికి సంబంధించినది మాత్రమే కాదని.. అంతకు మించిందని నేరుగానే చురకలంటించాడు. ఒకవైపు అజారుద్దీన్‌కి చురకలంటిస్తూనే.. మరోవైపు హెచ్‌సిఏ(HCA)లో ఉన్న అవినీతిని అరికట్టినట్టయితే.. భవిష్యత్ తరాలకు చెందిన ఎంతో మంది ఔత్సాహిక ఆటగాళ్లకు మేలు చేసిన వారవుతారని రాయుడు విజ్ఞప్తిచేశాడు. 

అంతటితో ఊరుకోని అంబటి రాయుడు.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్(Minister KTR)కి విజ్ఞప్తి చేస్తూ మరో ట్వీట్ చేశారు. హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అంత అవినీతి ఉంటే.. ఇక హెచ్‌సిఏ దేశంలో గొప్ప క్రికెట్ అసోసియేషన్‌గా ఎలా పేరు తెచ్చుకుంటుందని రాయుడు ఆవేదన వ్యక్తచేశాడు. 

హెచ్‌సిఏ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలోనే మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన అజారుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు చేస్తోన్న కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్ ఏమని స్పందిస్తారోననేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. Read also : మాజీ భారత కెప్టెన్‌కి “హెచ్‌సీఏ” లో ఘోర అవమానం

Trending News