Team India: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ప్లేయర్..!

Team India: మరో టీమిండియా ప్లేయర్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

Written by - Alla Swamy | Last Updated : Aug 28, 2022, 04:35 PM IST
  • క్రికెట్‌కు మరో ప్లేయర్ గుడ్‌బై
  • అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
  • ట్విట్టర్ వేదికగా వెల్లడి
Team India: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత ప్లేయర్..!

Team India: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ రాహుల్ శర్మ వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈమేరకు ట్విట్టర్‌లో వెల్లడించాడు. నా ఈప్రయాణంలో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, అభిమానులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ చేశాడు. అనారోగ్య సమస్యతో అతడు ఆటకు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతలా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ పక్షవాతం వంటి సమస్యతో రాహుల్ శర్మ బాధపడుతున్నాడు.

2011లో భారత జట్టు తరపున రాహుల్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఎక్కువ కాలం నిలువలేకపోయాడు. కేవలం నాలుగు వన్డేలు, రెండు టీ20ల్లో మాత్రమే ఆడాడు. గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలతో రాహుల్ శర్మ కలిసి పనిచేశాడు. వారితో డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకున్నాడు. అంతకంటే ముందు 2010లో అతడు ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నాడు.

డెక్కన్ ఛార్జర్స్ తరపున ఐపీఎల్‌లో ఆడాడు. ఆ తర్వాత పుణె వారియర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అత్యధిక మ్యాచ్‌లను ఐపీఎల్‌లోనే ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 44 మ్యాచ్‌లు ఆడి..40 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట క్లాస్ క్రికెట్‌లో పంజాబ్ జట్టు తరపున ఆడాడు.

Also read:Asia Cup 2022: ఇవాళ భారత్, పాక్ హైవోల్టేజ్‌ మ్యాచ్..పుజారా ప్లేయింగ్ ఎలవన్‌లో ఎవరెవరున్నారంటే..!

Also read:Nellore: నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..దంపతుల దారుణ హత్య..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News