Asian Champions Trophy 2021: పాక్​ను చిత్తు చేసి...సెమీస్ కు దూసుకెళ్లిన భారత్..

Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో పాకిస్థాన్​పై 3-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది భారత్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 08:39 PM IST
Asian Champions Trophy 2021: పాక్​ను చిత్తు చేసి...సెమీస్ కు దూసుకెళ్లిన భారత్..

Asian Champions Trophy: ఢాకా వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ (Asian Champions Trophy) హాకీ టోర్నీలో భారత్ సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 3-1 గోల్స్‌ తేడాతో ఓడించింది భారత్. ఇండియా తరపున హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet) రెండు గోల్స్ చేశాడు. 

మస్కట్‌ వేదికగా 2018లో జరిగిన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో భారత్‌-పాక్‌ జట్లు ట్రోఫీని పంచుకున్నాయి. ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్ల హోదాలో ఇరు జట్లు బరిలోకి దిగాయి. టోక్యో ఒలింపిక్స్‌(Tokyo Olympics)లో చారిత్రక కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు ఆడుతున్న తొలి టోర్నీ ఇదే.

Also Read: BWF WC 2021: టైటిల్ నిలబెట్టుకోలేక పోయిన పీవీ సింధు...క్వార్టర్ ఫైనల్లో తాయ్ చేతిలో ఓటమి..

ఈ టోర్నీలో కొరియాతో తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత్‌... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 9-0 గోల్స్‌ తేడాతో మట్టికరిపించింది. మూడో మ్యాచ్‌లో 3-1 గోల్స్‌ తేడాతో పాక్‌ను ఓడించింది. తద్వారా ఐదు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో సెమీఫైనల్స్‌(Semi-finals)కు అర్హత సాధించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News