AUS Vs ENG World Cup 2023: ఇంగ్లాండ్‌ పని గోవిందా.. గోవిందా.. ఆసీస్‌లో చేతిలో ఓటమితో ఇంటికి..!

Australia Vs England Highlights: సెమీస్‌కు మరింత చేరువైంది ఆస్ట్రేలియా. శనివారం ఇంగ్లాండ్‌ను 33 పరుగులతో తేడాతో ఓడించింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ వరల్డ్ కప్‌ సెమీ ఫైన్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఆస్ట్రేలియా విధించిన 287 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 4, 2023, 11:20 PM IST
AUS Vs ENG World Cup 2023: ఇంగ్లాండ్‌ పని గోవిందా.. గోవిందా.. ఆసీస్‌లో చేతిలో ఓటమితో ఇంటికి..!

Australia Vs England Highlights: వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ చెత్త ఆటతీరు కొనసాగుతోంది. ఆసీస్‌ చేతిలో 33 పరుగుల తేడాతో ఓడిపోయి.. విశ్వకప్‌ నుంచి అధికారికంగా ఔట్ అయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా  49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. మార్నస్ లబుషేన్ (71), స్టీవ్ స్మిత్ (44), కామెరూన్ గ్రీన్ (47) రాణించారు. అనంతరం ఇంగ్లాండ్ 253 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్ (64), డేవిడ్ మలన్ (50), మొయిన్ అలీ (42) మాత్రమే రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలయ్యారు. ఈ విజయంతో ఆసీస్ సెమీస్‌కు మరింత చేరువైంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు 10 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. మరో మ్యాచ్‌ గెలిస్తే.. సెమీస్‌లో బెర్త్ ఫిక్స్ చేసుకుంటుంది. ఇక ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 6 ఓటములతో అవమానకర రీతిలో టోర్నీ నుంచి తప్పుకోనుంది. 
 
మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా విధించిన 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. జానీ బెయిర్ స్టోను మిచెల్ స్టార్క్ డకౌట్ చేశాడు. కాసేపటికే జో రూట్ (13) కూడా ఔట్ అయ్యాడు. మూడో వికెట్‌కు ఓపెనర్ డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్ 84 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ కాస్త కోలుకుంది. మలాన్‌ (64 బంతుల్లో 50, 4 ఫోర్లు, ఒక సిక్స్)ను ఔట్ చేసి పాట్ కమిన్స్ దెబ్బ తీశాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కేవలం ఒక పరుగు చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ మధ్య ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ విజయం వైపు సాగింది. 36వ ఓవర్‌లో  స్టోక్స్ (90 బంతుల్లో 64, 2 ఫోర్లు, 3 సిక్సర్లు)‌ను జంపా ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. లియామ్ లివింగ్‌స్టోన్ (2), మొయిన్ అలీ (42), డేవిడ్ విల్లీ (15) స్వల్ప వ్యవధిలోనే ఔట్ అయ్యారు. చివర్లో క్రిస్ వోక్స్ (32), ఆదిల్ రషీద్ (20) ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు. మార్కస్ స్టోయినిస్ ఒక వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. ఆరంభంలో తడపడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (11), డేవిడ్ వార్నర్ (15) విఫలమయ్యారు. స్టీవ్ స్మిత్ (52 బంతుల్లో 44, 3 ఫోర్లు), మార్నస్ లబుషేన్ (83 బంతుల్లో 71, 7 ఫోర్లు) ఆదుకోవడంతో కోలుకుంది. కామెరూన్ గ్రీన్ (52 బంతుల్లో 47, 5 ఫోర్లు) తృటిలో హాఫ్‌ సెంచరీ మిస్ చేసుకోగా.. మార్కస్ స్టాయినిస్ (32 బంతుల్లో 35, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. ఆడమ్ జంపా (19 బంతుల్లో 29, 4 ఫోర్లు) చివర్లో మెరిశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌వోక్స్‌ 4 వికెట్ల తీయగా.. మార్క్‌ వుడ్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు, డేవిడ్ విల్లీ, లివింగ్‌స్టోన్ తలో వికెట్ దక్కింది. 

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..!  

Also Read: Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News