Pushpa Mania in Cricket: పుష్ప మేనియాతో..తగ్గేదే లే అంటున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు

Pushpa Mania in Cricket: టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా మామూలుగా లేదు. అప్పుడే దేశవిదేశాల్ని చుట్టేస్తోంది. విదేశీ క్రికెటర్లు కూడా పుష్పలో అల్లు అర్జున్ మేనరిజం ప్రదర్శిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2022, 06:58 AM IST
Pushpa Mania in Cricket: పుష్ప మేనియాతో..తగ్గేదే లే అంటున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు

Pushpa Mania in Cricket: టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా మామూలుగా లేదు. అప్పుడే దేశవిదేశాల్ని చుట్టేస్తోంది. విదేశీ క్రికెటర్లు కూడా పుష్పలో అల్లు అర్జున్ మేనరిజం ప్రదర్శిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన మెగా హిట్ సాధించేసింది. భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో పుష్ప సినిమా పాటలు ఊపేస్తున్నాయి. ముఖ్యమంగా యూట్యూబ్‌ను షేక్ చేసిన ఊ అంటావా పాట గానీ, లేదా శ్రీవల్లి పాటగానీ చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పటికే శ్రీవల్లి పాటకు (Srivalli Song) వార్నర్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరో విదేశీ క్రికెటర్‌కు పుష్ప మేనియా ఆకట్టుకుంది.

పుష్ప మేనియా (Pushpa Mania) ఇప్పుడు పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో క్రేజ్‌గా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2022లో కన్పిస్తోంది. పుష్ప సినిమాలో బాగా పాపులర్ డైలాగ్..నీ యవ్వ..తగ్గేదేలే..అక్కడి క్రికెటర్లను బాగా ఆకట్టుకుంది. అందుకే బీపీఎల్‌లో జరిగిన ఓ లీగ్ మ్యాచ్‌లో అమిత్ హసన్ అనే ఓ బౌలర్..ప్రత్యర్ది బ్యాట్స్‌మెన్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. వికెట్ తీసిన ఆనందంతో..అల్లు అర్జున్ (Allu Arjun) డైలాగ్ మేనరిజం గడ్డం కింద నుంచి చేయి అడ్డంగా జరుపుతూ మేనరిజం ప్రదర్శించాడు. ఇదిప్పుడు బాగా వైరల్ అవుతోంది. 

Also read: IPL 2022: దేశీయంగానే ఐపీఎల్ 2022.. కానీ ఆడియన్స్ లేకుండానే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News