BCCI Blue Tick Issue: రేపు పంద్రాగస్టు, దేశ స్వాతంత్య్ర దినోత్సవం. ప్రతి ఒక్కరూ తమ తమ సోషల్ మీడియా డీపీ, ప్రొఫైల్ పిక్స్‌ను మువ్వన్నెల జాతీయ జెండాతో నింపాలనేది ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు. ఆ పిలుపును తూచా తప్పకుండా అమలు చేసింది బీసీసీఐ. అంతే బ్లూ టిక్ వెరిఫికేషన్ కోల్పోయింది. అంటే ఎలాన్ మస్క్ కావాలని ఆ పని చేశాడా..అసలేం జరిగింది..
ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు డీపీలో జాతీయ జెండా పెట్టడం వల్ల ట్విట్టర్ ఎక్కౌంట్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను బీసీసీఐ కోల్పోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అంటే ఎలాన్ మస్క్ కావాలని ఈ పని చేశాడా అంటే కాదని తెలుస్తోంది. మరెందుకిలా జరిగింది. ఓ దేశం జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవడం తప్పు కాదు కదా. బీసీసీఐ ఎక్కౌంట్‌కు ఉన్న బ్లూ టిక్ ఉన్నట్టుంది ఎలా పోతుందని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఎందుకీ మార్పు జరిగిందా అని ఆరా తీస్తే ఆసలు సంగతి బయటపడింది.
వాస్తవానికి ఎక్స్ సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఎక్కౌంట్ డీపీ లేదా ప్రొఫైల్ పిక్ మార్చితే క్షణాల్లో ఆ ఎక్కౌంట్ బ్లూ టిక్ రద్దవుతుంది. ఆ తరువాత ఎక్స్ టీమ్ ఈ మార్పును పరిశీలిస్తుంది. పూర్తిగా రివ్యూ చేశాక బ్లూ టిక్ పునరుద్ధరిస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రొఫైల్ లేదా డీపీ పిక్స్‌లో జాతీయ జెండా పెట్టాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బీసీసీఐ వెంటనే తన ప్రొఫైల్ పిక్ మార్చుకుంది. నిబంధనల ప్రకారం ఎక్స్ ..బ్లూ టిక్ తొలగించింది. ఇప్పుడు రివ్యూ తరువాత తిరిగి బ్లూ టిక్ వెనక్కి వచ్చేస్తుంది.
కానీ బీసీసీఐ మరోసారి బ్లూ టిక్ కోల్పోయే ప్రమాదముంది. ఎందుకంటే పంద్రాగస్టు నేపధ్యంలో ప్రొఫైల్ పిక్ మార్చడంతో పోయిన బ్లూ టిక్ రివ్యూ తరువాత తిరిగి వచ్చేస్తుంది. పంద్రాగస్టు వేడుకల అనంతరం బీసీసీఐ తిరిగి తన పాత ప్రొఫైల్ పిక్ ఎంచుకునే అవకాశాలుంటాయి. అదే జరిగితే బీసీసీఐ ఎక్కౌంట్‌కు మరోసారి బ్లూ టిక్ ఎగిరిపోతుంది. రివ్యూ తరువాత మళ్లీ బ్లూ టిక్ వచ్చేస్తుంది.
Also read: Ind vs WI 5th T20: చివరి టీ20లో ఇండియా పరాజయం, సిరీస్ 3-2తో వెస్టిండీస్ కైవసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook