Ind vs WI 5th T20: టీమ్ ఇండియాకు మొదట్నించి ఉన్న అలవాటే. రెండు మ్యాచ్‌లు గెలిస్తే మూడవ మ్యాచ్‌లో ఓటమి చెందుతుంది. అదే జరిగింది. గెలవాల్సిన మూడవ మ్యాచ్ ఓడిపోవడంతో సిరీస్ కోల్పోయింది. 5 మ్యాచ్ టీ20 సిరీస్‌ను వెస్టిండీస్‌కు సమర్పించుకుంది. చివరి టీ20లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.
వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ ముగిసింది. వన్డే సిరీస్ గెల్చుకున్న టీమ్ ఇండియా టీ20 సిరీస్‌ను మాత్రం ఆ దేశానికి సమర్పించుకుంది. అత్యంత కీలకమైన ఐదవ టీ20 మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్ల తేడాతో ఇండియా ఓడిపోయింది. దాంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో వెస్టిండీస్ జట్టు కైవసం చేసుకుంది. బ్యాటర్ల నిర్లక్ష్యం, గతి తప్పిన బౌలింగ్‌తో టీమ్ ఇండియా కరేబియన్ పర్యటన ముగిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియాకు ప్రారంభంలోనే కష్టాలెదురయ్యాయి. నాలుగో టీ20లో చెలరేగి ఆడిన ఓపెనర్లు శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌లను హోసీన్ వరుస ఓవర్లలో సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత సూర్యకుమార్, తిలక్ వర్మలు కాస్సేపు ఆడినా ఫలితం లేకపోయింది. సూర్యకుమార్ ఒక్కడే 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. తిలక్ వర్మ, సూర్య కుమార్ తప్ప మరెవరూ ఆసించిన స్థాయిలో ఆడలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి విఫలమయ్యాడు.
ఇక166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ జట్టు మరో రెండు ఓవర్లు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ చెలరేగి ఆడటంతో వెస్టిండీస్ జట్టు విజయానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. కింగ్ 55 బంతుల్లో 55 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలవగా, నికోలస్ 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. వెస్టిండీస్ ఓపెనర్ మేయర్స్ వికెట్‌ను ఇండియా ప్రారంభంలోనే పడగొట్టినా ఆ తరువాత వికెట్ పడగొట్టలేకపోయింది. హిట్టర్లు పాతుకుపోవడంతో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. కీలకమైన మ్యాచ్‌లో ఓటమి చెంది సిరీస్‌ను 3-2తో కోల్పోయింది.
వాస్తవానికి సిరీస్ ప్రారంభంలో మొదటి రెండు టీ 20 మ్యాచ్‌లలో వెస్టిండీస్ సునాయసంగా విజయం సాధించడంతో 2-0 తో ఇండియా వెనుకబడింది. ఆ తరువాత 3,4 టీ20 మ్యాచ్‌లలో ఇండియా అనూహ్యంగా పుంజుకోవడంతో సిరీస్ 2-2తో సమమైంది. నిన్న జరిగిన కీలకమైన చివరి టీ20లో పరాజయంతో సిరీస్ ఓడిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook