New NCA Building: బెంగళూరులో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి శంకుస్థాపన చేసిన గంగూలీ, జై షా

New NCA Building: బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేయనున్న నేషనల్ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, సెక్రెటరీ జై షాలు శంకుస్థాపన చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2022, 09:55 PM IST
New NCA Building: బెంగళూరులో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి శంకుస్థాపన చేసిన గంగూలీ, జై షా

New NCA Building: బెంగళూరులో నూతనంగా ఏర్పాటు చేయనున్న జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి బీసీసీఐ సెక్రెటరీ జై షా (Jay Shah)తో కలిసి.. అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ (BCCI president Sourav Ganguly) సోమవారం శంకుస్థాపన చేశారు. 99 ఏళ్ల పాటు భూమిని లీజుకు తీసుకుని దీనిని ఏర్పాటు చేయబోతుంది బీసీసీఐ (BCCI). ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్, ఎన్‌సీఏ అధినేత వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఉన్న  నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (National Cricket Academy ) 2000లో స్థాపించారు.  ఇది ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నడుస్తోంది. దీనికిగాను కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)కు బీసీసీఐ అద్దె చెల్లిస్తోంది. ఇక్కడ అవుట్‌డోర్‌, ఇండోర్ ప్రాక్టీస్ సౌకర్యంతో పాటు ఆధునిక వ్యాయామశాల వంటి సదుపాయాలున్నాయి.

కొత్త ఎన్సీఏ కాంప్లెక్స్ లో  ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించనున్నారు. ఆటగాళ్లకు క్వార్టర్‌లను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ 16,000 sqft జిమ్, 40 ప్రాక్టీస్ పిచ్‌లు, 243 గదులు, ఒక ఓపెన్-ఎయిర్ థియేటర్,  క్రికెటర్ల పిల్లలకు క్రెచ్‌తో పాటు ఇండోర్ శిక్షణా సౌకర్యం ఉంది. బీసీసీఐ..కర్నాటక ప్రభుత్వం మద్దతుతో రూ. 50 కోట్లకు కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (KIADB) నుండి భూమిని 99 సంవత్సరాల లీజుకు పొందింది. ఇక్కడ బీసీసీఐ రెండు దశల్లో సౌకర్యాలను అభివృద్ధి చేస్తుంది. మొదటి దశ 2024 నాటికి పూర్తవుతుందని అంచనా.

Also Read: Cricket Marriages: క్రికెట్‌లో పెద్దోళ్లైనా...భార్యల కంటే వయస్సులో చిన్నోళ్లే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News