Beijing Winter Olympics: విశ్వక్రీడలపై కరోనా పంజా.. ప్రేక్షకులు లేకుండానే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్

Beijing Winter Olympics Tickets: చైనాలోని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే క్రీడలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో చైనా పౌరులకు టికెట్లు విక్రయిస్తామని చెప్పిన నిర్వాహకులు.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 12:24 PM IST
    • బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నిర్వాహకులు కీలక నిర్ణయం
    • ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నట్లు వెల్లడి
    • కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన
Beijing Winter Olympics: విశ్వక్రీడలపై కరోనా పంజా.. ప్రేక్షకులు లేకుండానే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్

Beijing Winter Olympics Tickets: చైనా రాజధాని బీజింగ్ వేదికగా వచ్చే నెల అనగా ఫిబ్రవరి నుంచి వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనూ శీతాకాల ఒలింపిక్స్ ను విజయవంతంగా జరుపుతామని నిర్వాహాకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకు ఒలింపిక్స్‌ టికెట్లు విక్రయించట్లేదని ప్రకటించారు. 

గతంలోనే అంతర్జాతీయ ప్రేక్షకులకు అనుమతి నిరాకరించిన చైనా.. దేశంలోని ప్రేక్షకులకు టికెట్లు విక్రయిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పుడు ప్రేక్షకులు లేకుండానే క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. 

అథ్లెట్లు, వారితోపాటు వచ్చే ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒలింపిక్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, ఒలింపిక్స్‌ వేదికలను ఏర్పాటు చేసిన సిబ్బందే ప్రేక్షకులుగా గ్యాలరీలో కూర్చొని క్రీడల్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

వింటర్ ఒలింపిక్స్

ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వింటర్ ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలు దౌత్యపరంగా బీజింగ్‌ ఒలింపిక్స్‌ను నిషేధించాయి. అయితే, అథ్లెట్లను పంపించేందుకు ఆయా దేశాలు ఒప్పుకున్నాయి. 

ఇప్పటికే పలు దేశాల నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు బీజింగ్‌కు బయలుదేరారు. చైనాలో అడుగుపెట్టిన వెంటనే వారిని బయోబబుల్‌లోకి పంపి.. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని అధికారులు తెలిపారు.  

Also Read: Ben Stokes: రూట్​ దారిలోనే స్టోక్స్​.. ఐపీఎల్​ మెగా వేలానికి దూరం!

Also Read: Team India Test Captain: కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే టెస్టు కెప్టెన్​ ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News