Tekkali Cheating Case: 65 రూపాయలకే లీటర్ డీజిల్.. ట్యాంక్‌లు ఫుల్ చేయించి.. చివరికి సూపర్ ట్విస్ట్

Man Cheated To Petrol Bunk Staff: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.65కే లీటర్ డీజిల్ కొట్టిస్తానని ట్రాక్టర్ల తీసుకువచ్చి.. ట్యాంక్‌లు ఫుల్ చేయించి చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ కేటుగాడి కోసం పోలీసులు వెతుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 10:33 AM IST
  • శ్రీకాకుళం జిల్లాలో ఘరానా మోసం
  • రూ.65కే డీజిల్ కొట్టిస్తానని గాలం
  • చివరి ట్విస్ట్ ఇచ్చిన కేటుగాడు
Tekkali Cheating Case: 65 రూపాయలకే లీటర్ డీజిల్.. ట్యాంక్‌లు ఫుల్ చేయించి.. చివరికి సూపర్ ట్విస్ట్

Man Cheated To Petrol Bunk Staff: ఇప్పటివరకు మీరు ఎన్నో రకాల మోసాల గురించి వినుంటారు.. చూసుంటారు.. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. 65 రూపాయలకే లీటర్ డీజిల్ కొట్టిస్తానని ట్రాక్టర్ల ట్యాంక్‌లు ఫుల్ చేయించి.. చివరి ఊహించని ట్విస్ట్ ఇచ్చి పరారయ్యాడు ఓ దుండగుడు. ఏకంగా పెట్రోల్ బంక్ సిబ్బందినే బురిడీ కొట్టించిన ఈ ఘటన టెక్కలిలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా.. 

టెక్కలి పట్టణంలో ఆయుష్ ఎంటర్ ప్రైజస్ ఫిల్లింగ్ పెట్రోలు బంకు ఉంది. ఇక్కడకు ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి.. తనకు తాను ఓ కాంట్రాక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. కోటబొమ్మాళి దగ్గర తాను రోడ్డు పనులు చేస్తున్నామని చెప్పాడు. తమ పనులకు సంబంధించిన వాహనాలు ఇక్కడికి వస్తాయని డీజిల్ కొట్టాలని వారితో ఒప్పందం చేసుకున్నాడు. వారి వద్ద కొన్ని రశీదులు తీసుకుని వెళ్లిపోయాడు.  

ఆ తరువాత ట్రాక్టర్ యజమానులతో డీల్ సెట్ చేసుకున్నాడు. గ్రావెల్, చిప్ లోడు వేసుందుకు ట్రాక్టర్లు కావాలని చెప్పాడు. రూ.2 వేలు కిరాయి ఇస్తానని అన్నాడు. తనకు ప్రభుత్వం నుంచి డీజిల్ 65 రూపాయలకే డీజిల్ వస్తుందని.. పెట్రోల్ బంక్‌లో తీసుకున్న రశీదులు వారికి చూపించాడు. అయితే తనకు ముందుగా డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. అతని మాటలు నమ్మిన డ్రైవర్లు ముందుగానే డబ్బులు అతడికి ఇచ్చారు. 

ట్రాక్టర్లను పెట్రోల్ బంక్ వద్దకు రావాలని.. తాను అక్కడే ఉంటానని వెళ్లిపోయాడు. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి.. తమ ట్రాక్టర్లు వస్తున్నాయని డీజిల్ కొట్టండి.. డబ్బులు కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ట్రాక్టర్లు తీసుకుని పెట్రోల్ బంక్ వద్దకు డ్రైవర్లు రాగా.. ఆ కేటుగాడు దగ్గర ఉండి ట్యాంక్‌లు ఫుల్ చేయించాడు. డీజిల్ కొట్టిన తరువాత ఒక్కో ట్రాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోగా.. దాదాపు 2,600 లీటర్ల డీజిల్ కొట్టించాడు. ఇక చివరి ట్రాక్టర్ ట్యాంక్‌లో డీజిల్ ఫుల్ చేస్తుండగా.. అక్కడి నుంచి మెళ్లిగా జారుకున్నాడు. 

డబ్బుల కోసం కేటుగాడిని పెట్రోల్ బంక్ సిబ్బంది వెతగ్గా.. ఎక్కడా కనిపించలేదు. ట్రాక్టర్ల డ్రైవర్లను ప్రశ్నించగా.. తమకు అతను ఎవరో తెలియదని.. రోడ్డు పనికి గ్రావెల్, ఇతర మెటీరియల్ కోసం కిరాయికి మాట్లాడుకున్నాడని చెప్పారు. డీజిల్ కూడా రూ.65కే కొట్టిస్తానని చెప్పినట్లు తెలిపారు. బంక్ యజమానికి సిబ్బంది విషయం తెలియజేయగా.. వెంటనే ఆయన వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అనంతరం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంలో ఆయిల్ నింపిన సిబ్బంది.. అతనిపై ఓ కన్నేసి ఉంచకుండా ఎటువంటి ఆధారం తీసుకోకుండా మోసపోయారు. 

Also Read: Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే పండగే..!   

Also Read: Indu Mystery Death : చిన్నారి ఇందు మృతి కేస్ లో వీడని సస్పెన్స్.. తల్లిదండ్రుల మొబైల్స్ స్వాధీనం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News