సూపర్ ఓవర్లో రో 'హిట్' సిక్సర్లతో గట్టెక్కిన భారత్

భారత్‌ నిర్దేశించిన 180 లక్ష్యాన్ని కివీస్‌(179/6 (20.0) సమం చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.  ఉత్కంఠభరితంగా సాగిన సూపర్‌ ఓవర్‌  మ్యాచ్‌లో భారత్‌ అద్వితీయ విజయంతో మెరిసింది. సూపర్ ఓవర్లో టిమ్ సౌతీ చివరి రెండు బంతుల్లో రెండు

Updated: Jan 29, 2020, 06:25 PM IST
సూపర్ ఓవర్లో రో 'హిట్' సిక్సర్లతో గట్టెక్కిన భారత్

సెడాన్ పార్క్, హామిల్టన్: భారత్‌ నిర్దేశించిన 180 లక్ష్యాన్ని కివీస్‌(179/6 (20.0) సమం చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది.  ఉత్కంఠభరితంగా సాగిన సూపర్‌ ఓవర్‌  మ్యాచ్‌లో భారత్‌ అద్వితీయ విజయంతో మెరిసింది. సూపర్ ఓవర్లో టిమ్ సౌతీ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరిగిన 3వ టి20లో భారత్‌ విజయం సాధించింది.

ఈ విజయంతో భారత్ తొలి టి20  సిరీస్ న్యూజిలాండ్ పై  సాధించినట్టయ్యింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన సూపర్ ఓవర్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గుప్టిల్ 17 పరుగులుచేశారు. 18 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించగా, దీంతో లక్ష్యాన్ని ఛేదించడానికి రోహిత్ శర్మ,లోకేష్ రాహుల్ టిమ్ సౌథీ వేసిన మొదటి నాలుగు బంతుల్లో కేవలం 8 పరుగులు చేయగా, చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమైనప్పుడు భారత వైస్ కెప్టెన్  రోహిత్ శర్మ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ విజయం సాధించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..