International Cricket Rules: క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆడేది తక్కువ దేశాలే అయినా.. ప్రజాదరణ మాత్రం అన్ని దేశాల నుంచి ఉంటుంది. క్రికెట్ గురించి తెలియకపోయినా.. స్టేడియాల్లో వీక్షించేందుకు క్యూకడుతుంటారు. ఇక క్రికెట్ ఆటకు సంబంధించి రూల్స్‌ను మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూపొందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆటలో మార్పులు తీసుకువస్తుంటుంది. క్రికెట్ నిబంధనల గురించి అభిమానులకు తెలుసు గానీ.. ఒక బ్యాట్స్‌మెన్ ఎన్ని విధాలుగా ఔట్ అవుతాడో కొద్దిమందికి మాత్రమే తెలుసు..! బ్యాట్స్‌మెన్ ఎన్ని రకాలుగా ఔట్ అవుతాడో చూద్దాం..
క్యాచ్ ఔట్: బ్యాట్స్‌మన్ షాట్ కొట్టినప్పుడు బ్యాట్‌కు తగిలి.. అది నేలకు టచ్ కాకముందే ఫీల్డర్ పట్టుకుంటే క్యాచ్ అవుట్‌గా పరిగణిస్తారు.
లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ): స్టంప్‌ల ముందు బ్యాట్స్‌మన్ తన శరీరంతో బాల్‌ను ఆపితే ఎల్బీడబ్యూగా పరిగణిగిస్తారు. ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి.
బౌల్డ్: బౌలర్ వేసిన బంతి నేరుగా స్టంప్‌లను తాకి.. బెయిల్స్ కిందపడితే బ్యాట్స్‌మన్ బౌల్డ్ అవుతాడు. ఈ నియమం గురించి అందరికీ తెలిసిందే.
స్టంప్ ఔట్: బ్యాట్స్‌మన్ క్రీజ్ దాటి షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు.. వికెట్ కీపర్ బంతిని పట్టుకుని బెయిల్స్‌ను పడగొడితే.. స్టంప్‌గా ఔట్‌గా పరిగణినిస్తారు
రన్ ఔట్: రన్స్ కోసం బ్యాట్స్‌మన్ వికెట్ల మధ్య పరిగెత్తే సమయంలో క్రీజ్‌లోకి చేరుకోకముందే.. ఫీల్డర్స్ బంతితో స్టంప్స్‌ను పడగొడితే రనౌట్ అయినట్లు ప్రకటిస్తారు.
హిట్ వికెట్: బ్యాట్స్‌మెన్ షాట్ ఆడే సమయంలో బ్యాట్ లేదా శరీరంలోని ఏదైనా భాగం స్టంప్‌లకు తగిలి బెయిల్స్ కిందపడిపోతే.. హిట్ వికెట్‌గా ప్రకటిస్తారు.
బాల్‌ను రెండుసార్లు కొడితే..: బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఉద్దేశపూర్వకంగా రెండోసారి బంతిని కొట్టడానికి ప్రయత్నిస్తే.. అంపైర్ ఔట్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది.
బంతిని అడ్డుకుంటే..: బ్యాట్స్‌మన్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ జట్టుకు ఆటంకం కలిగించినా.. బంతిని పట్టుకోకుండా అడ్డుకున్నా ఔట్‌గా ప్రకటించవచ్చు. రన్ అవుట్ చేసే సమయంలో బంతికి అడ్డుగా వచ్చినా ఔట్‌గా ప్రకటిస్తారు.
టైమ్ ఔట్: ఒక బ్యాట్స్‌మెన్ అవుట్ అయిన తర్వాత.. కొత్త బ్యాట్స్‌మెన్ మూడు నిమిషాల్లో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే.. టైమ్ ఔట్‌గా ప్రకటిస్తారు.
రిటైర్డ్ ఔట్: ఒక బ్యాట్స్‌మన్ ఫీల్డ్ అంపైర్‌కు చెప్పకుండా.. గ్రౌండ్ నుంచి బయటకు వెళితే రిటైర్డ్ ఔట్‌గా ప్రకటించవచ్చు.
Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి