Sunrisers Hyderabad New Head Coach: ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హెడ్ కోచ్‌గా విండీస్ దిగ్గజం బ్రయాన్ లారాను తొలగించగా.. ఆయన స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్రధాన కోచ్ డేనియల్ వెటోరిని నియమించింది. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన యాషెస్ 2023లో ఆస్ట్రేలియాకు వెటోరి సహాయ కోచ్‌గా పనిచేశాడు. వెటోరిని కోచ్‌గా నియమించినట్లు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత సీజన్‌లో చివరి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి హైదరాబాద్ జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ మాస్టర్ ప్లాన్‌తో వెటోరిని కోచ్‌గా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
డేనియల్ వెటోరి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోచ్‌గా పనిచేశాడు. 2014 నుంచి 2018 వరకు ఆర్‌సీబీ టీమ్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. వెటోరి కోచ్‌గా ఉన్న సమయంలో ఆర్‌సీబీ 2015లో ప్లేఆఫ్స్, 2016లో ఫైనల్‌కు చేరుకుంది. బెంగుళూరు జట్టు తరుఫునే ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం వెటోరీ ది హండ్రెడ్‌లో బర్మింగ్‌హామ్ కోచ్‌గా ఉన్నాడు. దీంతో పాటు గతేడాది మే నుంచి ఆస్ట్రేలియా జట్టు అసిస్టెంట్ కోచ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. గతంలో బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ బౌలింగ్ సలహాదారుగా కూడా ఉన్నాడు.
🚨Announcement🚨
Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡
Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86
— SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023
"బ్రయాన్ లారాతో మా 2 సంవత్సరాల అనుబంధం ముగిసింది. సన్‌రైజర్స్‌కు అందించిన సహకారానికి ధన్యవాదాలు. మీ భవిష్యత్ ప్రయత్నాలకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం" అని సన్‌రైజర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టింది.
ఆల్‌రౌండర్‌గా వెటోరి న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని దిగ్గజ ఆటగాడిగా ఎదిగాడు. కివీస్ జట్టు తరుఫున 113 టెస్టులు ఆడి 4531 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో 362 వికెట్లు పడగొట్టాడు. 295 వన్డేల్లో 2253 పరుగులు చేయగా.. 305 వికెట్లు తీశాడు. 34 టీ20ల్లో 205 రన్స్ చేసి.. 38 వికెట్లు పడగొట్టాడు. 34 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వెటోరీ.. 28 వికెట్లు తీసుకున్నాడు. ఈ కివీస్ దిగ్గజంపై ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం భారీ ఆశలు పెట్టుకుంది.
Also Read: Delhi AIIMS Fire Accident: ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో మంటలు
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి లైన్ క్లియర్.. పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook