Pravin Dubey in Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి కొత్త ఆటగాడు

Pravin Dubey replaces Amit Mishra: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా IPL 2020 నుంచి వైదొలగిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబెను తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) ఫ్రాంచైజీ ప్రకటించింది. ఢిల్లీ జట్టు వెల్లడించిన వివరాల ప్రకారం టోర్నమెంట్‌లోని మిగతా అన్ని మ్యాచ్‌లకు దూబే అందుబాటులో ఉండనున్నాడు.

Updated: Oct 19, 2020, 11:57 PM IST
Pravin Dubey in Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి కొత్త ఆటగాడు

Pravin Dubey replaces Amit Mishra: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా IPL 2020 నుంచి వైదొలగిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబెను తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) ఫ్రాంచైజీ ప్రకటించింది. ఢిల్లీ జట్టు వెల్లడించిన వివరాల ప్రకారం టోర్నమెంట్‌లోని మిగతా అన్ని మ్యాచ్‌లకు దూబే అందుబాటులో ఉండనున్నాడు. కర్ణాటకకు చెందిన ఈ యంగ్ క్రికెటర్ కర్ణాటక రంజీ జట్టు తరపున 14 టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొని 16 వికెట్లు తీసుకుని 6.87 ఎకానమితో కొనసాగుతున్నాడు. Also read : Riana Lalwani details: క్రికెట్ ప్రియులను షేక్ చేసిన ఈ రియా లల్వాని ఎవరు ?

అక్టోబర్ 3న షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ( Kolkata Knight Riders ) మ్యాచ్ సందర్భందా అమిత్ మిశ్రా బౌలింగ్ చేయి మధ్య వేలికి గాయమైంది. అప్పటి నుంచి ఈ సీజన్‌లో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లకు దూరమైన మిశ్రాకు ఆ తర్వాత సర్జరీ కూడా జరిగింది. అమిత్ మిశ్రా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. 

గాయం కారణంగా IPL 2020 నుంచి ఔట్ అయిన అమిత్ మిశ్రా.. అంతకంటే ముందుగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీశాడు. ఐపిఎల్ 2020 నుంచి నిష్క్రమించేనాటికి ఐపిఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లసిత్ మలింగ ( Lasith Malinga ) తర్వాత ఆ రికార్డు సొంతం చేసుకున్న ఆటగాడిగా అమిత్ మిశ్రా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ ప్రాంచైజీకి చెందిన ఆటగాళ్లను వరుస గాయాలు వేధిస్తున్నా.. ఐపిఎల్ 2020 పాయింట్స్ పట్టికలో మాత్రం ఆ జట్టు టాప్‌ ర్యాంక్‌లోనే కొనసాగుతుండటం విశేషం. Also read : Steve Smith about DC bowlers: ఢిల్లీ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయాం: స్టీవ్ స్మిత్

ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ అందులో ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 14 పాయింట్స్‌తో ముందంజలో కొనసాగుతోంది. ఆ తర్వాత రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (  Royal Challengers Bangalore ), నాలుగో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ( KKR ) ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe