DC vs RR match, IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించిన ఢిల్లీ

DC vs RR match highlights: దుబాయ్:  ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 30వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో గెలుపొంది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేసింది. 

Last Updated : Oct 15, 2020, 12:35 AM IST
DC vs RR match, IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించిన ఢిల్లీ

DC vs RR match highlights: దుబాయ్:  ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ( Rajasthan Royals ) జరిగిన 30వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ( Delhi Capitals ) 13 పరుగుల తేడాతో గెలుపొంది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేసింది. 162 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే చతికిలపడింది. ఢిల్లీ విధించిన లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. ఢిల్లీ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ నిలిచి గెలవలేకపోయింది. Also read : Happy Birthday Gautam Gambhir: యూసఫ్ పఠాన్ ట్వీట్.. గౌతమ్ గంభీర్ ఫుల్ హ్యాపీ

ఢిల్లీ ఆటగాళ్లలో ఓపెనర్‌ పృధ్వీషా తొలి బంతికే డకౌట్ కాగా మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్ ( Shikhar Dhawan )‌ (57 పరుగులు; 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. షా స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అజింక్య రహానే సైత్ 2 పరుగులకే పెవిలియన్ బాటపట్టగా ఆ తర్యాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టేన్ శ్రేయాస్‌ అయ్యర్‌ ( Shreyas Iyer ) (53 పరుగులు; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మార్కస్ స్టొయినిస్ (18), అలెక్స్ కెరీ (14), అక్షర్ పటేల్ (7) పరుగులు చేశారు. రాజస్థాన్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ (3/19) ఢిల్లీని తక్కువ స్కోర్‌కి పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యాడు. Also read : CSK vs SRH Match: అంపైర్‌ను ధోని బెదిరించాడు.. నెటిజన్ల విమర్శలు

రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ బెన్ ‌స్టోక్స్ ( Ben stokes )‌ (41 పరుగులు; 35 బంతుల్లో  6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌‌గా నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో రాబిన్ ఊతప్ప ( 32 పరుగులు; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సంజు శాంసన్ ( Sanju Samson ) ( 22 పరుగులు; 18 బంతుల్లో 2 ఫోర్లు), జోస్ బట్లర్ ( 22 పరుగులు; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే (2/37), నోర్ట్జే(2/33) రాణించారు. నోర్జే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. Also read : David Warner: SRH ఓటమిపై డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News