ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లే ఆఫ్ ఆశలను సీజవంగా నిలుపుకుంది. మరోవైపు ఐపీఎల్ 2010 సీన్ రిపీట్ చేస్తుందానని చెన్నై, ధోనీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లీగ్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో చెన్నై గెలుపొందిన సన్‌రైజర్స్, రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి చెందడంపై ఎస్ఆర్హెచ్ (SRH) కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) స్పందించాడు.
బౌండరీలు బాదాలని ప్రయత్నించాం. కానీ స్లో వికెట్ కావడం వల్ల సాధ్యం కాలేదన్నాడు. ‘మా జట్టులో మరో బ్యాట్స్‌మన్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. స్లో వికెట్ మీద బౌండరీలు కొట్టడం అంత తేలిక కాదు. తొలుత 160 టార్గెట్ ఛేదించవచ్చునని భావించాం. కానీ అలా జరగలేదు. స్వింగ్ బౌలర్లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు.
పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. కానీ చెన్నై స్వింగ్ బౌలర్లు మాకు అడ్డుకట్ట వేసి పరుగులు నియంత్రించారు. బౌలింగ్‌లో పరవాలేదనిపించాం. అయితే బ్యాటింగ్‌లో మరింత రాణిస్తే విజయం సాధించేవాళ్లం. చెన్నై విషయానికొస్తే జట్టులో 6 నుంచి ఏడుగురు బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఆల్ రౌండర్లు వారికి ప్లస్ పాయింట్. మా జట్టులో మరో బ్యాట్స్‌మన్ ఉంటే మంచి ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉందని’ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో తలపడనుంది. కాగా, ధోనీ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు), బెయిర్ స్టో (24 బంతుల్లో 23; 2 ఫోర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 20 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమిపాలైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe