Happy Birthday Gautam Gambhir: యూసఫ్ పఠాన్ ట్వీట్.. గౌతమ్ గంభీర్ ఫుల్ హ్యాపీ

రెండు వరల్డ్ కప్‌లు (T20, వన్డే వరల్డ్ కప్) గెలవడంలో కీలకపాత్ర వహించిన క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)కు సహచరుడు యూసఫ్ పఠాన్ విషెస్ (Yusuf Pathan) తెలిపాడు.

Last Updated : Oct 14, 2020, 05:33 PM IST
Happy Birthday Gautam Gambhir: యూసఫ్ పఠాన్ ట్వీట్.. గౌతమ్ గంభీర్ ఫుల్ హ్యాపీ

టీమిండియా రెండు వరల్డ్ కప్‌లు (T20, వన్డే వరల్డ్ కప్) గెలవడంలో కీలకపాత్ర వహించిన క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)కు సహచరుడు యూసఫ్ పఠాన్ విషెస్ (Yusuf Pathan) తెలిపాడు. నేడు గౌతమ్ గంభీర్ 39 వసంతాలు పూర్తి చేసుకుని 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. గంభీర్‌ పుట్టినరోజు (Happy Birthday Gautam Gambhir) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాడు తోటి క్రికెటర్ యూసఫ్ పఠాన్.

అయితే యూసఫ్ పఠాన్ (Yusuf Pathan) తనకు విషెస్ తెలిపిన తీరు కచ్చితంగా గంభీర్‌ను ఆకట్టుకుంది. ఎందుకంటే.. వరల్డ్ కప్ విన్నర్.. దయగల వ్యక్తి, భారత్ అందించిన గొప్ప బ్యాట్స్‌మన్ గంభీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు పఠాన్. నీ మంచి పనులతో ఇంకా మిలియన్ల మందికి సహాయం చేయాలని, వారి జీవితంలో మార్పు తీసుకురావాలని ఆశిస్తూ గతంలో తాము ఇద్దరు ప్రాతినిథ్యం వహించిన కోల్‌కతా జట్టు మాజీ కెప్టెన్ గంభీర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపాడు యూసఫ్.

 

 

 

యూసఫ్ పఠాన్ విషెస్‌ ట్వీట్‌కు గంభీర్ స్పందించాడు. ‘అద్భుతమైన మాటలకు ధన్యవాదాలు బ్రదర్.. త్వరలోనే నిన్ను కలుసుకుంటానంటూ’ మాజీ క్రికెటర్ గంభీర్ ట్వీట్ చేశాడు. కాగా, ఐపీఎల్‌లో రోహిత్ శర్మ, ధోనీ తర్వాత విజయవంతమైన కెప్టెన్ గంభీర్ కావడం విశేషం.  కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ రెండు పర్యాయాలు టైటిల్ విజేతగా నిలిపాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News