ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో విశ్వ విజేత ఎవరో తేలిపోయింది. లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య తీవ్ర ఉత్కంఠతో జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. దీంతో ఇంగ్లండ్‌కి ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఫైనల్స్ వరకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. కానీ నేటి విజయంతో ఇంగ్లండ్‌కి ఆ కల నెరవేరింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైందన్నట్టుగా ఇంగ్లండ్ ఎప్పటి నుంచో కంటున్న కల నేడు నిజమైంది. అయితే, అంతకన్నా ముందుగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ టై అవడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఐసిసి సూపర్ ఓవర్ నిర్వహించింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో 1 వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ సైతం మళ్లీ టైగానే మిగిలింది.
Also read: ఆ 45 నిమిషాలే టీమిండియా కొంపముంచాయి : విరాట్ కోహ్లీ
అయితే, ఐసిసి నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్‌లోనూ మ్యాచ్ టై అయినట్టయితే, అంతకన్నా ముందుగా ఇరు జట్లలో సుపిరియర్ బౌండరీ కౌంట్ ఎవరికి మెరుగ్గా ఉంటే వారినే విజయం వరిస్తుంది. సరిగ్గా ఈ నిబంధన ప్రకారమే సుపిరియర్ బౌండరీ కౌంట్ మెరుగ్గా ఉన్న ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్‌ను ఎగరేసుకుపోయింది.
Also read : ఐపిఎల్ 2020లో ధోని మా టీమ్‌లోనే ఆడుతాడు
మొట్టమొదటిసారిగా ఇంగ్లండ్ సాధించిన ఈ విజయం ఆ దేశ క్రికెట్ ప్రియులకు కచ్చితంగా ఓ మరిచిపోలేని అనుభూతి కానుంది. అంతేకాకుండా సొంత గడ్డపైనే ఈ విజయాన్ని సొంతం చేసుకోవడం ఇంగ్లండ్ జట్టుకి మరింత ఆనందాన్నిస్తోంది.