FIFA World Cup 2022: హోరా హోరీగా ఫిఫా ప్రపంచకప్, విశ్వ విజేత అర్జెంటీనానే, 4-2 పెనాల్టీ షూటౌట్‌తో మెస్సీ టీమ్ విజయం

FIFA World Cu 2022: నరాలు తెగే ఉత్కంఠ. ప్రపంచంలోని రెండు అతిపెద్ద జట్ల మధ్య జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్. ఫ్రాన్స్‌పై విజయంతో అర్జెంటీనా టైటిల్ విన్నర్‌గా నిలిచింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 18, 2022, 11:59 PM IST
FIFA World Cup 2022: హోరా హోరీగా ఫిఫా ప్రపంచకప్, విశ్వ విజేత అర్జెంటీనానే, 4-2 పెనాల్టీ షూటౌట్‌తో మెస్సీ టీమ్ విజయం

ఫిఫా ప్రపంచకప్ 2022 అర్జెంటీనా ఎగురేసుకుపోయింది. ఉత్కంఠ భరితమైన ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్‌లో మెస్సీ టీమ్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఇరువురి మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. తొలి అర్ధభాగం, రెండవ భాగం ముగిసేసరికి రెండు జట్లు 2-2 స్కోరుతో సమ ఉజ్జీగా నిలిచాయి. దాంతో అదనంగా సమయం ఇచ్చారు. అందులో కూడా 1-1 గోల్స్ చేయడంతో..పెనాల్టీ షూటౌట్ జరిగింది. 

ఊహించినట్టే ప్రపంచంలోని రెండు అతిపెద్ద జట్ల మధ్య ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగింది. ఫ్రాన్స్ సంచలన ప్రదర్శనతో చెలరేగి అర్జెంటీనాకు ఆందోళన కల్గించింది. మెస్సీ మెరుపులు, మారియా అదరగొట్టిన గోల్స్‌తో తొలుత ఫ్రాన్స్...0-2తో వెనుకబడింది. ఆ తరువాత కేవలం నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ చేయడంతో స్కోరు సమం అయింది. ఆ తరువాత ఆధిపత్య గోల్ కోసం రెండు జట్లు తీవ్రంగా ప్రయత్నించినా..సాధ్యం కాలేదు. అదనపు సమయం ఇవ్వగా..రెండు జట్లు చెరో గోల్ సాధించడంతో ఇక పెనాల్టీ షూటౌట్ ఆడాల్సి వచ్చింది. 

ఆటలో పూర్తిగా ఆధిపత్యం సాధించి మెస్సీ జట్టుకు చుక్కలు చూపించిన ఫ్రాన్స్ ..పెనాల్టీ షూటౌట్ సమయంలో తడబడింది. ఇటు ఆటగాళ్లు అటు గోల్ కీపర్ ఒత్తిడికి లోనైనట్టు స్పష్టంగా కన్పించింది. అదే సమయంలో మెస్సీ టీమ్ మాత్రం పెనాల్టీ షూటౌట్ సాధించడంలో..గోల్స్ నిలువరించడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా పెనాల్టీలో 4-2 తేడాతో ప్రపంచకప్ గెల్చుకుంది అర్జెంటీనా. అర్జెంటీనాకు ఇది మూడవ ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా ఆధిక్యత సాధించడంతో...ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఫిఫా ప్రపంచకప్ 2022 గెల్చుకుంది. ఫుట్‌బాల్ విశ్వ విజేతగా నిలిచింది. 

Also read: Lionel Messi Income: లియోనెల్ మెస్సీ ఏడాది సంపాదన వింటే..నోరెళ్లబెట్టాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News