Lionel Messi In Shock: లియోనెల్ మెస్సికి షాకిచ్చిన సౌది అరేబియా.. తిరుగులేని చరిత్రకు బ్రేకులు

Argentina vs saudi arabia Match of FIFA world cup 2022: ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే అర్జెంటినాకు సౌది అరేబియా చేతిలో గట్టి షాక్ తగిలింది. వరుస విజయాలతో తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న లియోనెల్ మెస్సి సక్సెస్‌కి సౌది అరేబియా అడ్డుపడింది. 

Written by - Pavan | Last Updated : Nov 22, 2022, 07:09 PM IST
  • లియోనెల్ మెస్సి విజయయాత్రకు బ్రేకులేసిన సౌది అరేబియా
  • అర్జెంటినాను 1-2 తేడాతో ఓడించిన సౌది అరేబియా
  • చరిత్రను తిరగరాసిన సౌది అరేబియా జట్టు
Lionel Messi In Shock: లియోనెల్ మెస్సికి షాకిచ్చిన సౌది అరేబియా.. తిరుగులేని చరిత్రకు బ్రేకులు

Argentina vs saudi arabia Match of FIFA world cup 2022: ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలో తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న అర్జెంటినాకు బ్రేకులు పడ్డాయి. అర్జెంటినాను వరుసగా 35 మ్యాచుల్లో గెలిపించిన ఫుల్ బాల్ దిగ్గజం, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి విజయయాత్రకు సౌది అరేబియా జట్టు బ్రేకులు వేసింది. ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం అర్జెంటిన్ vs సౌది అరేబియా జట్ల మధ్య జరిగిన తొలి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సౌది అరేబియా చేతిలో లియోనెల్ మెస్సి జట్టు  1-2 తేడాతో ఓటమిపాలైంది. కతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లో అర్జెంటినా విజయ పరంపరను అడ్డుకోవడంలో సౌది అరేబియా సక్సెస్ అయింది. 

సౌది అరేబియా 2 గోల్స్‌తో తమ జట్టును సమానం చేసి మ్యాచ్‌ను టై చేసేందుకు లియోనెల్ మెస్సి ఎంతో గట్టిగా కృషి చేసినప్పటికీ.. సౌది అరేబియా జట్టు సైతం అంతకంటే ఎక్కువ శ్రమించి ప్రత్యర్థిని తమ దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకోగలిగింది.

74 నిమిషాల పాటు హోరాహోరిగ జరిగిన పోరులో ఆఖరికి అర్జెంటినాపై జట్టుపై సౌది అరేబియాదే పై చేయి అయింది. లియోనెల్ మెస్సికి ఇదే ఆఖరి వరల్డ్ కప్ కానుండగా.. చివరి వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచ్‌లోనే అతడి దండయాత్రకు బ్రేకులు పడటం మెస్సి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు సౌది అరేబియా ఫుట్ బాల్ ఫ్యాన్స్ ఆ జట్టును అభినందనల్లో ముంచెత్తుతున్నారు. లియోనెల్ మెస్సి లాంటి క్రీడా దిగ్గజం జట్టుపై గెలిచినందుకు సౌది అరేబియా ఆనందానికి అవధుల్లేవు. 

సౌది అరేబియా జట్టుపై లియోనెల్ మెస్సి ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఇప్పటివరకు ఈ రెండు జట్లు వరల్డ్ కప్‌లో నాలుగుసార్లు తలపడగా.. అందులో రెండుసార్లు మెస్సీ కెప్టేన్‌గా వ్యవహరిస్తున్న అర్జెంటినా విజయం సొంతం చేసుకోగా.. మరో రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. దీంతో ఈసారి కూడా అర్జెంటినా ఓడిపోయే ప్రసక్తే లేదనుకున్నారంతా. కానీ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) వరుస విజయాలకు సౌది అరేబియా అడ్డుకట్ట వేసింది.

Also Read : Ind Vs NZ: టీమిండియాదే సిరీస్.. చివరి టీ20 మ్యాచ్ టై

Also Read : Ind Vs NZ: కాన్వే, ఫిలిప్స్ అర్ధసెంచరీలు.. సిరాజ్, అర్షదీప్ సూపర్ బౌలింగ్

Also Read : Nicholas Pooran: టీ20 వరల్డ్ కప్‌ ఎఫెక్ట్.. కెప్టెన్సీకి నిలోలస్ పూరన్ గుడ్ బై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News