Mohammad Azharuddin: హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌పై వేటు, షోకాజ్ నోటీసులు జారీ

Azharduddin sacked As HCA President: క్రికెట్ బోర్డ్ రూల్స్ ఉల్లంఘించడం లాంటి ఆరోపణలతో పాటు పలు కేసులు అజారుద్దీన్‌పై పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్‌ను తప్పించారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 17, 2021, 02:09 PM IST
  • టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు భారీ షాక్
  • హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై వేటు
  • హెచ్‌సీఏలో ప్రాథమిక సభ్యత్వం రద్దు, షోకాజ్ నోటీసులు జారీ
Mohammad Azharuddin: హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌పై వేటు, షోకాజ్ నోటీసులు జారీ

Mohammad Azharuddin removed as HCA president: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిపై వేటు పడింది. క్రికెట్ బోర్డ్ రూల్స్ ఉల్లంఘించడం లాంటి ఆరోపణలతో పాటు పలు కేసులు అజారుద్దీన్‌పై పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్‌ను తప్పించారు. 

హెచ్‌సీఏలో అజారుద్దీన్ సభ్యత్వాన్ని కూడా క్రికెట్ బోర్డు రద్దు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు షోకాజు నోటీసులు సైతం జారీ చేసినట్లు సమాచారం. జూన్ 10న జరిగిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇతర సభ్యులతో చర్చించకుండానే అజారుద్దీన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బోర్డు నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు అజారుద్దీన్ హెచ్‌సీఏ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వరుసగా వివాదాలు చెలరేగుతున్నాయి. దీంతో అజారుద్దీన్‌ను హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం (Mohammad Azharuddin Sacked As HCA President)తో పాటు విచారణ ముగిసేవరకు ప్రాథమిక సభ్యత్వం సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: IPL 2021: ఎంఎస్ ధోనీని ఆ యువ క్రికెటర్ దైవంగా ఆరాధిస్తాడు, పోలిక వద్దంటాడట

మే 25న ఉన్నతస్థాయి సమావేశం అనంతరం అజారుద్దీన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ క్రికెట్ క్లబ్‌కు అజారుద్దీన్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎలాంటి అనుమతి లేని ఓ బోర్డులో పదవిని కొనసాగించడం, నిబంధనలు ఉల్లంఘించి పదవులు చేపట్టడమేనని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఈ క్రమంలో అజారుద్దీన్‌పై వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 27 సెప్టెంబర్ 2019న అజారుద్దీన్‌ను నియమించారు. మరో లీగ్ జట్టుకు మెంటార్‌గా పదవి చేపట్టడం హెచ్‌సీఏ నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు హెచ్‌సీఏలో ‌జరుగుతున్న అవకతవకలపై  ఎమ్మెల్సీ కవిత కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 

Also Read: Team India For WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు BCCI ఎంపిక చేసిన ఆటగాళ్లు వీరే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News