Actress Alankrita Sahai: సినీ నటి ఇంట్లో చోరీ...రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగలు

చంఢీగర్ లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సెలబ్రెటీ ఇంట్లోకి చొరబడి..ఆమెను బంధించి మరీ నగదు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2021, 04:58 PM IST
  • నటి ఇంట్లో దొంగతనం
  • ఆమెను బెదిరించి రూ.6లక్షలు చోరీ చేసిన దుండగలు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Actress Alankrita Sahai: సినీ నటి ఇంట్లో చోరీ...రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగలు

Actress Alankrita Sahai:  ఇటీవల దొంగలు పట్టపగలే ఇళ్లలోకి దూరి మరి దోచుకొవడం ఎక్కువైంది.  సామాన్యులనే కాదు సెలబ్రీటీలను సైతం వదలడం లేదు. అటువంటి సంఘటనే మంగళవారం (సెప్టెంబర్‌ 7న) చంఢీగర్‌(Chandigarh)లో చోటు చేసుకుంది. ముగ్గురు దుండగులు నటి, మోడల్‌ అలంకృత సహాయ్‌(Actress Alankrita Sahai)ని బంధించి దాదాపు 6 లక్షల వరకు దోచుకెళ్లారు. 

వివరాల్లోకి వెళితే.. 
మోడల్‌, నటి అలంకృత తన తల్లిదండ్రుల కోసం ఇటీవల చంఢీగర్‌లోని సెక్టార్‌ 27లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఢిల్లీ(Delhi)లో ఉన్న వాళ్లు రెండు, మూడు రోజుల్లో ఇక్కడికి షిఫ్ట్‌ కావాల్సింది. ఈ తరుణంలో మంగళవారం అలంకృత అక్కడి వచ్చి ఏర్పాట్లను పరిశీలించింది. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉందని గమనించిన  దుండగులు బలవంతంగా అలంకృత ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి(Theft) పాల్పడ్డారు. 

Also Read: Bigg Boss 5 Telugu: రవి, శ్రీరామ్‌, యానీ, ప్రియ బాగా క్లోజ్‌.. అయినా నా మద్దతు ఆమెకే: నాగబాబు

దొంగతనానికి వచ్చిన ముగ్గురిలో ఒకరు ఆమె ఏటీఎం కార్డుని తీసుకెళ్లి రూ.50 వేలు విత్‌డ్రా చేశాడు. ఆ సమయంలో మిగిలిన ఇద్దరు అలంకృత(Actress Alankrita) ను బంధించి, అరిస్తే చంపేస్తామని బెదిరించారు. అంతేకాదు ఇంట్లో ఉన్న నగలు, నగదును కూడా తీసుకెళ్లారు. మొత్తంగా దాదాపు 6 లక్షల వరకు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. 

ముగ్గురిలో ఒకడు అతనే..
మూడు రోజుల క్రితం అలంకృత  ఫర్నిచర్‌(Furniture) కొనగా, ఆదివారం వాటిని డెలివరీ చేశారు. ఆ డెలివరీకి వచ్చిన వారిలో ఒకరు ఈ ముగ్గురిలో ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.పోలీసుల(Police) ఫిర్యాదులో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News