'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోని 37వ వడిలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పుట్టినరోజు జరుపుకున్నారు. భార్య సాక్షి, కూతురు జీవా, జట్టులోని తన తోటి ఆటగాళ్ల మధ్య ధోని బర్త్ డే వేడుక సరదాగా జరిగింది. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి ధోని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తన సహచర క్రికెటర్లతో పాటు మాజీలు పలువురు ధోనికి శుభాకాంక్షలు చెప్పారు.
ఎంఎస్ ధోని ఫాన్స్ అకౌంట్ ఒకటి ధోనీ బర్త్ డే సెలబ్రేషన్స్‌లకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో ధోనీ, జీవా, సాక్షి నవ్వుతూ ఉండగా.. పాండ్య సోదరులతో సహా జట్టు సభ్యులు 'హ్యాపీ బర్త్ డే మహీ' అంటూ పాట పాడారు. ధోనీ కేక్ కట్ వీడియో మీకోసం:
Birthday Celebrations Video of #Thala 💕🎂🎊. Thanks for the video #ChinnaThala @ImRaina#WhistlePodu #HappyBirthdayMSDhoni pic.twitter.com/ulixHJY6Hi
— MS Dhoni Fans #Dhoni (@msdfansofficial) July 7, 2018
సురేష్ రైనా ఎంఎస్ ధోనితో దిగిన ఫోటో ఒకటి పోస్టు చేశారు. 'లెజెండ్ ఎంఎస్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు.
Happy birthday to the legend @msdhoni. There can be nobody like you. ✌️ pic.twitter.com/gMDepTPN3l
— Suresh Raina (@ImRaina) July 6, 2018
వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఎంఎస్ ధోనికి బర్త్ డే విషెస్ తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే ఎంఎస్ ధోని. కెరీర్ సాగుతూనే ఉండాలని, స్టంపింగ్ల కంటే వేగంగా అన్నింట్లో ఆనందం పొందాలని కోరుకుంటున్నా. ఓం ఫినిషరాయనమః!' అని పోస్టు చేశారు. 'మహి భాయ్ నువ్వు సంతోషంగా ఉండాలి' అంటూ విరాట్, బుమ్రా సహా పలువురు ఆటగాళ్లు మహికి శుభాకాంక్షలు తెలిపారు.
#HappyBirthdayMSDhoni . May your life be longer than this stretch and may you find happiness in everything, faster than your stumpings. Om Finishaya Namaha ! pic.twitter.com/zAHCX33n1y
— Virender Sehwag (@virendersehwag) July 6, 2018
2004లో బంగ్లాదేశ్‌పై తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన ధోని.. శ్రీలంకపై 2005లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2006లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను సైతం ధోని ఆడారు. ఇప్పటి వరకు మొత్తం 90 టెస్టులు, 318 వన్డేలు,91 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 331 మ్యాచ్‌లకు ధోని సారథ్యం వహించగా.. అందులో భారత్ 178 మ్యాచ్‌లు గెలవడం విశేషం. శుక్రవారం కార్డిఫ్లో ఇంగ్లండ్ తో జరిగిన రెండో ట్వంటీ 20 మ్యాచ్.. అతని 500వ అంతర్జాతీయ మ్యాచ్.