అనవసరంగా రనౌట్ అయ్యావ్... హర్భజన్..

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ, స్పోర్ట్స్ తదితర ప్రముఖులు సామజిక మాధ్యమాల్లో హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘త్రో బ్యాక్’ ట్రెండ్ నడుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా

Updated: May 25, 2020, 09:14 PM IST
అనవసరంగా రనౌట్ అయ్యావ్... హర్భజన్..

హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ, స్పోర్ట్స్ తదితర ప్రముఖులు సామజిక మాధ్యమాల్లో హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘త్రో బ్యాక్’ ట్రెండ్ నడుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఇళ్ల వద్దనే ఉంటున్న క్రికెటర్లు తమ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ అభిమానులను ఆనందపరుస్తున్నారు. అయితే టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ తన ఇన్‌స్టాలో హైదరాబాద్ వేదికగా 2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో  తను 17 బంతుల్లో 37 పరుగులు చేసిన వీడియోను పంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన (Yuvraj Singh) యువరాజ్ సింగ్ తో భజ్జీ భాగస్వామ్యం నమోదు చేస్తున్న తరుణంలో యువీ అనవసరంగా రనౌట్ అయ్యాడు. 

Also Read:Coronavirus peak: భయంకరంగా మారనున్న కరోనా విజృంభణ..

కాగా ఇదే అంశాన్ని భజ్జీ  (Harbhajan Singh) ప్రస్తావిస్తూ ఈ రనౌట్‌లో తప్పెవరిదని ఆ వీడియో కింద కామెంట్ జతచేశాడు. అనవసరంగా పరుగు తీసి రనౌట్ అయ్యావని ఇందులో తప్పెవరిదంటూ చివరికి మంచి ఇన్నింగ్స్ ఆడావంటూ భజ్జీ కామెంట్ చేశాడు. దీనిపై యువరాజ్ స్పందిస్తూ పాజీ ఈ రనౌట్‌లో నీ తప్పేమి లేదని, నేనే ముందు పిలిచానని, అందుకే నేనే వెనుదిరిగిపోయానన్నాడు. అయినా నువ్వు నీ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తావనే నమ్మకం ఉంది అప్పుడు’ అంటూ బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.