Coronavirus peak: భయంకరంగా మారనున్న కరోనా విజృంభణ..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారి జూన్‌లో దీని విస్తరణ మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి

Last Updated : May 25, 2020, 07:12 PM IST
Coronavirus peak: భయంకరంగా మారనున్న కరోనా విజృంభణ..

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతున్న(Covid-19) కరోనా మహమ్మారి జూన్‌లో దీని విస్తరణ మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా ఉండనుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా భారత్ లో మహమ్మారి వ్యాప్తి తీవ్ర రూపం దాల్చనుందని అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్ (Lockdown) సడలింపుల తరువాత చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, భారత్ లో ఇదే పరిణామం చోటుచేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే నెలలో కరోనా విజృంభణ ఊహించిన దాని కంటే ఎక్కువనే ఉండొచ్చని వారు వెల్లడిస్తున్నారు.

Also Read: చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించారా..?

మరోవైపు భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి పరీక్షల సంఖ్య పెరగడం కూడా కారణం కావొచ్చని అంటువ్యాధుల నిపుణులు తన్మయ్‌ మహాపాత్ర పేర్కొంటున్నారు. వీటికి లాక్‌డౌన్ సడలింపులు కారణంగా చెప్పలేమని, ఆ ప్రభావం రానున్న రోజుల్లోనే తెలుస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎప్పటికీ లాక్‌డౌన్‌ ఉంచలేమని, సడలింపులు ఇవ్వడం చాలా అవసరమన్నారు. కరోనా తీవ్రతలో మనం ఇంకా దారుణ స్థాయికి చేరలేదని, ఈ పరిస్థితులను చూస్తుంటే ఏప్రిల్, మే కంటే జూన్‌లో దేశవ్యాప్తంగా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని, ఇక జూలైలో తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అని మహాపాత్ర పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.

Trending News