గాళ్‌ఫ్రెండ్‌తో మళ్లీ మీడియాకు చిక్కిన హార్థిక్ పాండ్యా

ఇటీవల కాలంలో తరచుగా తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి చక్కర్లు కొడుతూ మీడియా కంటపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మరోసారి ఆమెతో కలిసి తిరుగుతూ వార్తల్లోకెక్కాడు.

Last Updated : Mar 21, 2018, 10:47 PM IST
గాళ్‌ఫ్రెండ్‌తో మళ్లీ మీడియాకు చిక్కిన హార్థిక్ పాండ్యా

ఇటీవల కాలంలో తరచుగా తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి చక్కర్లు కొడుతూ మీడియా కంటపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మరోసారి ఆమెతో కలిసి తిరుగుతూ వార్తల్లోకెక్కాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత జరిగిన నిదహాస్ ట్రోఫీ నుంచి కొంత బ్రేక్ దొరకడంతో ఈ విరామంలోనే తన గాళ్‌ఫ్రెండ్ ఎల్లీ అవ్‌రమ్‌తో కలిసి టైస్ పాస్ చేస్తున్నాడు పాండ్య. తాజాగా ఓ యాడ్ షూట్ కోసం హార్థిక్ పాండ్య గోరెగావ్‌లోని ఫిల్మీస్థాన్ స్టూడియోకి వెళ్లగా అతని గాళ్‌ఫ్రెండ్ ఎల్లీ అవ్‌రమ్‌ కూడా అక్కడికి వచ్చింది. ఇలా ఈ ఇద్దరూ ఒక్క చోట వుండగా మీడియా కెమెరాలు బంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

@elliavrram Was Spotted With Her Cricketer Beau @hardikpandya93 😱🙌🏽 More photos on the blog via #SimplyAmina (LINK IN BIO)💥 . . . #Bollywood #BollywoodBlog #BollywoodGirl #Actor #BollywoodGirl #BollywoodActress #Heroine #ElliAvram #IndianCricketer #HardikPandya #Celeb #CelebrityBlogger #StoriesOfindia #EntertainmentNews #Mumbai #MumbaiStories #Movies #EverydayIndia #IncredibleIndia #FashionAddict #CelebrityCouples #CelebrityStyle #CelebrityFashion #Famous #CelebrityNews #CelebrityBlogger #EntertainmentNews #Star #IndianCinema #Indiagram #CelebrityNews #Reporter

A post shared by SimplyAmina 🌴 (@simplyaminaxx) on

హార్థిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ హాజరైనప్పుడు కొత్తజంటతో హార్థిక్, ఎల్లీ కలిసి తీసుకున్న ఫోటోలు అప్పట్లో సోషల్‌మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఎల్లీ మాత్రం అదంతా పుకార్లే కానీ అందులో వాస్తవం లేదని కొట్టిపారేసింది.

 

ఇదిలావుండగానే ఇటీవల మరోసారి హార్థిక్‌ని ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేయడానికి మరోసారి బుక్ అయ్యింది అమ్మడు. ఆ తర్వాత మళ్లీ ఇదిగో ఇలా యాడ్ ఫిలిం షూట్ స్పాట్‌లో ఇద్దరూ కలిసి కెమెరాలకు చిక్కడం సోషల్ మీడియాలో మళ్లీ చర్చనియాంశమైంది.

 

Trending News