Hardik Pandya Vs Virat Kohli: హార్థిక్ పాండ్య విరాట్ కోహ్లీని అవమానించాడా ? కోహ్లీ ఫ్యాన్స్ vs పాండ్యా ఫ్యాన్స్

IND vs AUS 2nd ODI Match: ఇండియా vs ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా, టీమిండియా మాజీ కేప్టేన్ విరాట్ కోహ్లీని అవమానించాడా అంటూ నెటిజెన్స్ ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు. అందుకు కారణం విరాట్ కోహ్లీ పట్ల హార్థిక్ పాండ్య వ్యవహరించిన తీరే కారణమైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2023, 11:13 PM IST
Hardik Pandya Vs Virat Kohli: హార్థిక్ పాండ్య విరాట్ కోహ్లీని అవమానించాడా ? కోహ్లీ ఫ్యాన్స్ vs పాండ్యా ఫ్యాన్స్

IND vs AUS 2nd ODI Match: హార్థిక్ పాండ్య తొలిసారిగా కేప్టేన్‌గా నేతృత్వం వహించిన ఇండియా vs ఆస్ట్రేలియా ఫస్ట్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో పాండ్యపై సీనియర్స్ నుంచి ప్రశంసల జల్లు కురిసింది. హార్థిక్ పాండ్యాలో ఫ్యూచర్ కేప్టేన్ కనిపిస్తున్నాడు అంటూ అతడిని సీనియర్ క్రికెటర్స్ అభినందనల్లో ముంచెత్తారు. హార్థిక్ పాండ్య గతంలో టీ20 ఫార్మాట్‌లో కెప్టేన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది కానీ వన్డే ఫార్మాట్లో మాత్రం ఇదే తొలిసారి కావడంతో హార్ధిక్ పాండ్య కెప్టేన్సీపై చాలా మంది కన్ను ఉండింది. హార్థిక్ పాండ్య వన్డే జట్టు కేప్టేన్సీ బాధ్యతలు ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితం అయినప్పటికీ.. ఒకరకంగా కెరీర్ పరంగా కేప్టేన్సీగా చేసిన తొలి వన్డే మ్యాచ్‌లోనే విజయం అందుకోవడం పాండ్యాకు కూడా ప్లస్ పాయింటే. 

ఇవన్నీ ఇలా ఉంటే.. తాజాగా ఈ మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా, టీమిండియా మాజీ కేప్టేన్ విరాట్ కోహ్లీని అవమానించాడా అంటూ నెటిజెన్స్ ఒక వీడియోను వైరల్ చేస్తున్నారు. అందుకు కారణం విరాట్ కోహ్లీ పట్ల హార్థిక్ పాండ్య వ్యవహరించిన తీరే కారణమైంది. ముంబై వాంఖడే స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే హార్థిక్ పాండ్య, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ మ్యాచ్ ప్లానింగ్ గురించి చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ విషయంలో ఏదో చెబుతున్నట్టుగా సూచిస్తుండగానే హార్థిక్ పాండ్య అదేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుండటం చూసి అందరూ అవాక్కయ్యారు. తను చెబుతుండగానే తన మాటలు పట్టించుకోకుండా వెళ్తున్న హార్థిక్ పాండ్యాను చూసి ఏం చేయాలో అర్థం కానట్టుగా విరాట్ కోహ్లీ ముఖంలో హావభావాలు కనిపించాయి. దాంతో విరాట్ కోహ్లీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

విరాట్ కోహ్లీ ఏదో సలహా ఇస్తుండగానే హార్థిక్ పాండ్యా మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోవడం చూసి ఏం జరుగుతుందో అర్థం కానట్టు కుల్దీప్ యాదవ్ సైతం బిత్తరపోవడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

తనకంటే సీనియర్ మోస్ట్ క్రికెటర్ ప్లస్ టీమిండియాను ఎన్నో మ్యాచుల్లో విజయ తీరాలకు చేర్చిన మాజీ కెప్టేన్ పట్ల హార్థిక్ పాండ్యా వ్యవహరించిన తీరు ఇదేనా అంటూ ఇప్పటికే కొంతమంది కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హార్ధిక్ పాండ్యా సక్సెస్‌ఫుల్ క్రికెటర్ అయితే అయ్యుండొచ్చు కానీ అంతమాత్రానికే అప్పుడే అతడికి పొగరు తలకెక్కిందా అంటూ ఇంకొంతమంది విరుచుకుపడుతున్నారు. హార్థిక్ పాండ్యాను అతడి అభిమానులు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఈ వివాదం అటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, ఇటు హార్థిక్ పాండ్య ఫ్యాన్స్ మధ్య మున్ముందు మరింత వివాదానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఈ వివాదం సంగతి పక్కనపెడితే ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్ దృష్టి అంతా రేపు ఆదివారం విశాఖలోని డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఇండియా vs ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌పైనే ఉంది. 

ఇది కూడా చదవండి : Kane Williamson equaled Sachin's Record: కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు ఈక్వల్! 

ఇది కూడా చదవండి : Team India: రిషభ్ పంత్ స్థానంలో టీమ్ ఇండియాకు లభించిన కీపర్ కమ్ బ్యాటర్ ఎవరో తెలుసా

ఇది కూడా చదవండి : IPL 2023 Updates: RCB జట్టులో కీలకమార్పు, విల్ జాక్స్‌కు బదులుగా మైకేల్ బ్రేస్‌వెల్ జట్టులో చేరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

More Stories

Trending News