మహిళల ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైన హైదరాబాది ప్లేయర్ అరుంధతి రెడ్డి

ఫిబ్రవరి 21న సిడ్నీలో ప్రారంభమయ్యే మహిళల ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత జట్టులో హైదరాబాద్ కు చెందిన అరుంధతి రెడ్డి ఎంపికయ్యింది. బీసిసీఐ సెలక్షన్ కమీటీ  ఆదివారం భారత మహిళల టీ20 ప్రపంచ కప్ భారత మహిళల తుదిజట్టును ఎంపిక చేసింది. 

Updated: Jan 13, 2020, 07:37 PM IST
మహిళల ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైన హైదరాబాది ప్లేయర్ అరుంధతి రెడ్డి

హైదరాబాద్ : ఫిబ్రవరి 21న సిడ్నీలో ప్రారంభమయ్యే మహిళల ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత జట్టులో హైదరాబాద్కు చెందిన అరుంధతి రెడ్డి ఎంపికయ్యింది. బీసిసీఐ సెలక్షన్ కమీటీ  ఆదివారం భారత మహిళల టీ20 ప్రపంచ కప్ భారత మహిళల తుదిజట్టును ఎంపిక చేసింది. 

2018లో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఆడిన 22 ఏళ్ల అరుంధతీ రెడ్డి మరోసారి  ప్రపంచకప్ టోర్నీకి  ఎంపికవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రపంచకప్ గెలవడమే అంతిమ లక్ష్యం అన్నారు. దేశం కోసం ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నామని, నేను ఈ సవాలు కోసం ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు. దేశవాళీ క్రికెట్లో అనేక మ్యాచ్లు ఆడిన ఆమె, తక్కువ ఓవర్లున్నా ఈ పొట్టి ఫార్మట్లో బౌలర్గా రాణించడం ఒక సవాలు అని ఆమె అన్నారు.  

ఆస్ట్రేలియాలోని పిచ్‌లు ఫ్లాట్గా ఉంటాయని, జట్ల స్కోర్లు భారీగా నమోదయ్యే అవకాశముంటుందని అమె అభిప్రాయపడ్డారు. అదేరకంగా బౌలర్లకు ఇదో సవాలేనని ఆమె అంటున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..