ICC Cricket World Cup 2023: సోమవారం ఉదయం వెలువడిన నివేదికల ప్రకారం.. రెగ్యులర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ వరల్డ్ కప్ 2023 లో టీమ్ ఇండియా ఆడనున్న వరుసగా రెండో మ్యాచ్‌కు కూడా అవ్వనున్నాడు. డెంగ్యూ జ్వరంతో భాదపడుతున్న శుభమన్ గిల్.. ప్రపంచ కప్ 2023లో భాగంగా ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన ICC ODI క్రికెట్ భారత జట్టు ప్రారంభ మ్యాచ్ నుండి గిల్ తప్పుకున్నాడు.
వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మెన్ జాబితాలో రెండో స్థానంలో ఉన్న శుభమాన్ గిల్ బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూఢిల్లీలోని జరిగే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ప్రపంచ కప్ లో భారత్ ఆడనున్న రెండో మ్యాచ్ కి కూడా దూరం అవ్వనున్నాడు.
“శుబ్‌మన్ గిల్ కోలుకుంటున్నాడు.. అతను జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు.. గిల్ జట్టుతో ఉంటాడు.. అంతేకానీ విశ్రాంతి కోసం చండీగఢ్‌కు మాత్రం వెళ్లే అవకాశం లేదు. గిల్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు తిరిగి మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాము మరియు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడడం అనేది అతని తదుపరి నివేదికపై ఆధారపడి ఉంటుంది” అని సోమవారం ANI సోమవారం పేర్కొంది.
ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో గోల్డెన్ డక్ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా డకౌట్ అయ్యాడు. వరుసగా 3 వికెట్లు పడిన తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ సహాయంతో కాస్త నిలదొక్కుకొని 200 పరుగుల టార్గెట్ ను చేధించారు.
ప్రపంచకప్ 2023 లో టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో టాస్ గెలుచుకున్న కంగారులు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ప్రారంభంలో కాస్త తడబడినా.. డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 41), స్టీవెన్ స్మిత్ (71 బంతుల్లో 46) ద్వారా 69 పరుగుల రెండవ వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. మిచెల్ మార్ష్ డక్. అయితే స్మిత్ ఔటైన తర్వాత, భారత బౌలింగ్ యూనిట్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఆసీస్ మ్యాచ్‌పై తమ పట్టును కొనసాగించలేకపోయింది.
Also Read: TTD News: తీపికబురు అందించిన టీటీడీ.. వారికి జీతాలు పెంపు
రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లతో భారత స్పీన్ చాలా బలంగా ఉంది. భారత బౌలర్ లు ఆస్ట్రేలియాను 199 పరుగులకు ఆలౌట్ చేసింది. జడేజా మూడు వికెట్లు, కుల్దీప్ మరియు పేస్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వన్డే ప్రపంచకప్‌లో మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.భారత్ ఛేజింగ్ సమయంలో.. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మరియు శ్రేయాస్ అయ్యర్‌లను స్కోర్ చేయకుండానే పెవిలియన్‌కు పంపడంతో మొదట్లో భారత్ తడబడింది. భారత్ 2/3 వద్దఉండగా.. విరాట్ కోహ్లీ (116 బంతుల్లో 85) మరియు KL రాహుల్ (115 బంతుల్లో 97*) భారత్ లి విజయాన్ని అందించారు. వీరు చేసిన 165 పరుగుల భాగస్వామ్యం కారణంగా ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అక్టోబర్ 11న జరగనున్న మ్యాచ్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.
Also Read: Assembly Elections 2023 Live Updates: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ఫలితాలు ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి