Women's World Cup 2022: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పై వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీ..

ICC Women's  Cricket World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ మహిళ జట్టుపై వెస్టిండీస్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది. కేవలం 7 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 01:54 PM IST
Women's World Cup 2022: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పై వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీ..

Women's World Cup, West Indies Women vs England Women:  ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022లో (ICC Women's World Cup 2022) వెస్టిండీస్ మరోసారి అదరగొట్టింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను (England Women) మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదన ప్రారంభించిన ఇంగ్లండ్ ఆఖర్లో బోల్తా పడింది.47.4 ఓవర్లలో 218 పరగులకు ఆలౌట్ అయి.. 7 పరుగలు తేడాతో ఓటమి చవిచూసింది.

చివరి 18 బంతుల్లో ఇంగ్లండ్ కేవలం 9 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. అప్పటికే ఎక్లెస్టోన్ 32, కేట్ క్రాస్ 27 పరుగులతో ఆడుతున్నారు. దాదాపు విజయం ఇంగ్లాండ్ దే అనుకున్నారు ఆంతా. అప్పుడే విండీస్ బౌలర్ అనిస్సా మహ్మద్‌ ఇంగ్లీష్ జట్టుకు షాకిచ్చింది. ఒకే ఒవర్ లో రెండు వికెట్లు తీసి కరేబియన్ జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. ప్రపంచకప్ లో భాగంగా...న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ (West Indies Women) విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లండ్ మళ్లీ పోటీలో నిలవాలని చూస్తుంది. 

Also Read: Deepak Chahar: గుడ్‌న్యూస్, దీపక్ చహార్..సీఎస్కేకు ఆడుతున్నాడట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News