Deepak Chahar: గుడ్‌న్యూస్, దీపక్ చహార్..సీఎస్కేకు ఆడుతున్నాడట

Deepak Chahar: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు అభిమానులకు. టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బ్యాక్ టు టీమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2022, 12:44 PM IST
Deepak Chahar: గుడ్‌న్యూస్, దీపక్ చహార్..సీఎస్కేకు ఆడుతున్నాడట

Deepak Chahar: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు అభిమానులకు. టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బ్యాక్ టు టీమ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

మరి కొద్దిరోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కానుందనగా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు , ఆ జట్టు అభిమానులకు గుడ్‌న్యూస్ అందుతోంది. టీమ్ ఇండియా అద్భుతమైన బౌలర్ దీపక్ చహార్ బ్యాక్ టు టీమ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి ఐపీఎల్ 2022లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండవ ఆటగాడు దీపక్ చహార్. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14 కోట్లు ఖర్చుపెట్టి దీపక్‌ను కొనుగోలు చేసింది. అయితే..తొడ కండరాల గాయం, తీవ్రమైన నొప్పి కారణంగా మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమవుతాడనే వార్తలకు వచ్చాయి. దాంతో ఇటు చెన్నై సూపర్‌కింగ్స్, అటు దీపక్ చహార్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఇప్పుడు దీపక్ చహార్ విషయంలో గుడ్‌న్యూస్ అందుతోంది. దీపక్ చహార్‌కు సర్జరీ అవసరం లేదని..ఏప్రిల్ రెండవవారానికి ఆటకు అందుబాటులో రానున్నాడని సమాచారం. అంటే తొలిభాగంలో కొన్ని మ్యాచ్‌లు మిస్సయినా..తరువాత అందుబాటులో రానున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన దీపక్ చహార్ 14 వికెట్లు పడగొట్టాడు. 

Also read: England: జో రూట్ ఎలా అవుటయ్యాడు, బంతిని అంచనా వేసేలోగానే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News