ICC ODI World Cup Qualifiers: ఒమిక్రాన్ ధాటికి వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ రద్దు

ICC ODI World Cup Qualifiers: సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విజృభింస్తున్న వేళ.. మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ పోటీలను రద్దు చేశారు. ఇదే విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటన చేసింది. ర్యాంకింగ్స్ లో మెరుగ్గా ఉన్న జట్లను ప్రపంచకప్ ఆడేందుకు అర్హత సాధించనట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 09:12 AM IST
ICC ODI World Cup Qualifiers: ఒమిక్రాన్ ధాటికి వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ రద్దు

ICC ODI World Cup Qualifiers: మహిళల వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వచ్చే ఏడాది జింబాబ్వేలోని హరారేలో జరగాల్సిన క్వాలిఫయర్స్ పోటీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి రద్దు చేసింది. వన్డే ర్యాంకింగ్స్ లో మెరుగ్గా ఉన్న వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని ఇచ్చింది. ఆఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా ఒమిక్రాన్‌ విజృంభిస్తుండడం వల్ల ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. 

“ఆఫ్రికాలో అనేక దేశాలు ప్రయాణాలపై నిబంధనలు పెట్టాయి. ఈ టోర్నీలో ఆడుతున్న దేశాలు ఇక్కడ నుంచి తమ దేశానికి ఎలా వెళ్లాలో అని ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఈ పోటీలను ఆపక తప్పలేదు. నిబంధనల ప్రకారం ర్యాంకింగ్‌లో మెరుగ్గా ఉన్న వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ప్రపంచకప్‌లో ఆడబోతున్నాయి’’ అని ఐసీసీ తెలిపింది.

న్యూజిలాండ్‌లో 2022లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడే చివరి మూడు జట్లను తేల్చడం కోసం తొమ్మిది జట్లతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. షెడ్యుల్‌ ప్రకారం శనివారం పాకిస్థాన్‌తో జింబాబ్వే, థాయ్‌లాండ్‌తో యుఎస్‌ఏ మధ్య మ్యాచ్‌లు మొదలుకాగా.. శ్రీలంక సహాయక సిబ్బంది ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడం వల్ల వెస్టిండీస్‌తో ఆ జట్టు మ్యాచ్‌ ఆరంభం కాలేదు. వచ్చే ఏడాది మార్చి 4న ఆరంభమయ్యే ప్రపంచకప్‌కు ఆతిథ్య న్యూజిలాండ్‌తో పాటు భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా ఇప్పటికే అర్హత సాధించాయి.

Also Read: IND vs NZ 1st Test Day 3: కాన్పూర్ టెస్టు.. 296 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

Also Read: Krunal Pandya: సంచల నిర్ణయం తీసుకున్న కృనాల్‌ పాండ్యా.. గుడ్‌బై చెప్పేశాడు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News