IPL 2022 Auction: ఐపీఎల్ 2022 వేలంలో అతిపెద్ద వయస్కుడు తాహిర్.. పిన్న వయసు ప్లేయర్ ఎవరో తెలుసా?

ఐపీఎల్ 2022 వేలంలో పాల్గొనబోతున్న ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ అతిపెద్ద వయస్కుడుగా రికార్డు నెలకొల్పాడు. పిన్న వయసు ప్లేయర్‌గా ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 స్టార్ నూర్ అహ్మద్ నిలిచాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 05:55 PM IST
  • 2022 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితా విడుదల
  • మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు
  • ఐపీఎల్ 2022 వేలంలో అతిపెద్ద వయస్కుడు తాహిర్
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 వేలంలో అతిపెద్ద వయస్కుడు తాహిర్.. పిన్న వయసు ప్లేయర్ ఎవరో తెలుసా?

Imran Tahir Becomes Oldest Player in IPL 2022 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు విడుదల చేసింది. ఐపీఎల్ 2022 వేలం కోసం 1214 మంది తమ పేరును నమోదుచేసుకోగా.. 590 మంది క్రికెటర్లతో కూడిన జాబితాను బీసీసీఐ ప్రకటించింది. బెంగుళూరులో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం నిర్వహించనున్నట్లు కూడా బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. బీసీసీఐ విడుదల చేసిన జాబితాలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. 

ఐపీఎల్ 2022 వేలంలో పాల్గొనబోతున్న ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ అతిపెద్ద వయస్కుడుగా రికార్డు నెలకొల్పాడు. 42 ఏళ్ల తాహిర్ గత కొంత కాలంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడాడు. నిబంధలు కారణంగా చెన్నై అతడిని రిటైన్ చేసుకోలేకపోయింది. 2018, 2021లో చెన్నై టైటిల్ గెలవడంలో తాహిర్ కీలక పాత్ర పోషించాడు. 2018లో వికెట్ల వేట కొనసాగించాడు. 2021లో ఎక్కువగా మ్యాచులు ఆడకపాయినా.. తన అనుభవంను కుర్రాళ్లకు ఉపయోగపడేలా చేశాడు. 

ఐపీఎల్ 2022 వేలంలో పిన్న వయసు ప్లేయర్‌గా ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 స్టార్ నూర్ అహ్మద్ నిలిచాడు. 17 ఏళ్ల అహ్మద్ ఇంగ్లండ్‌తో జరగనున్న U19 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో పాల్గొననున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ఈ టీనేజర్ ఇప్పటికే బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ఆడుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌తో ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2022 వేలంలో కూడా ఇతడికి మంచి ధర పలికే అవకాశం ఉంది. 

బీసీసీఐ విడుదల చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ (బేస్‌ ప్రైస్‌ రూ. 20 లక్షలు), పశ్చిమ్ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్‌ తివారీ (రూ. 50 లక్షలు), వెటరన్‌ బౌలర్ శ్రీశాంత్ (రూ. 50 లక్షలు) ఉన్నారు. గతేడాది ఆడని ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈసారి బరిలోకి దిగుతున్నాడు. అయితే వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్‌, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్ గేల్‌.. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్ వేలంలో లేరు. 

Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ 2022 వేలంలో పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి.. ఏ ప్రాంచైజీ అయినా ఆసక్తి చూపేనా?

Also Read: Budget 2022 Political Reaction: ఇదో దిక్కుమాలిన బడ్జెట్.. కేంద్రంపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News