IND A vs PAK A Asia Cup 2023: ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌తో టీమిండియా ఢీ.. తుది జట్లు ఇవే..!

India A Vs Pakistan A Final Match Updates: ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో భారత్ A-పాకిస్థాన్ A జట్లు తలపడనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.    

Written by - Ashok Krindinti | Last Updated : Jul 23, 2023, 01:06 PM IST
IND A vs PAK A Asia Cup 2023: ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌తో టీమిండియా ఢీ.. తుది జట్లు ఇవే..!

India A Vs Pakistan A Final Match Updates: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు అంటేనే ఓ క్రేజ్. ఏ స్థాయిలో జట్లు తలపడినా అభిమానులకు భారీ ఆసక్తి ఉంటుంది. నేడు ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ A-పాకిస్థాన్ A జట్లు పోటీ పడనున్నాయి. యువ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. లీగ్‌ స్టేజ్‌లో పాకిస్థాన్‌ టీమ్‌ను చిత్తు చేసిన భారత్.. ఫైనల్ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా రంగంలోకి దిగుతోంది. సెమీస్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌-ఎపై భారత్‌-ఎ విజయం సాధించగా.. శ్రీలంక-ఎ జట్టుపై పాకిస్థాన్‌-ఎ విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా దయాది జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. 

ఈ చిన్న టోర్నీలో టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్ పోరు‌లో బంగ్లాదేశ్ జట్టుపై ఓడిపోయో దశలో అద్భుతంగా పుంజుకుంది. బౌలర్లు కలిసికట్టుగా రాణించి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫైనల్లోనూ అదే జోరును కనబర్చి పాక్ జట్టును చిత్తు చేసి కప్‌తో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అన్ని రంగాల్లో బలంగా ఉన్న టీమిండియాను ఓడించాలంటే పాక్ జట్టు శక్తికి మించి పోరాడాల్సిందే.

ముఖ్యంగా కెప్టెన్ యశ్‌ ధుల్, ఓపెనర్ సాయి సుదర్శన్ బ్యాటింగ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నారు. గ్రూప్ దశలో పాకిస్థాన్ సాయి సుదర్శన 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో యశ్‌ ధుల్ (108) శతకం బాదాడు. అభిషేక్ శర్మ కూడా ఫామ్‌లో ఉండడంతో బ్యాటింగ్‌లో ఎలాంటి ఇబ్బందిలేదు. బౌలింగ్‌లో నిశాంత్ సింధు, మానవ్‌ సంధు, రాజ్‌వర్థన్‌ హంగార్గేకర్ అదరగొడుతున్నారు. వీరికి తోడు హర్షిత్‌ రాణా, నితీశ్‌ రెడ్డి, రియాన్‌ పరాగ్‌ పుంజుకుంటే దయాది జట్టుకు కష్టాలే. 

అటు పాకిస్థాన్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. సెమీస్‌లో ఆతిథ్య శ్రీలంకను సునాయసంగా ఓడించింది. ఉమైర్ యూసుఫ్, కెప్టెన్ మహ్మద్ హారీస్,  మహ్మద్‌ వసీమ్‌ బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటుండగా.. బౌలింగ్‌లో మహమ్మద్‌ వాసిమ్‌ జూనియర్‌, అర్షద్‌ ఇక్బాల్‌ ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఫైనల్ పోరుకు తుది జట్లు ఇలా.. (అంచనా)

టీమిండియా A: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, యష్ ధుల్ (కెప్టెన్), నిశాంత్ సింధు, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజ్‌వర్థన్‌ హంగర్గేకర్, ఆకాష్ సింగ్.

పాకిస్థాన్ A: సామ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఉమైర్ యూసుఫ్, టైబ్ తాహిర్, ఖాసిమ్ అక్రమ్, మహ్మద్ హారిస్ (కెప్టెన్, వికెట్ కీపర్), ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వాసిం జూనియర్, సుఫియాన్ ముకిమ్, అర్షద్ ఇక్బాల్.

Also Read: Anakapalle Child Death: చిన్నారిని గరిటెతో కొట్టిన తల్లి.. 16 నెలల పసికందు మృతి  

Also Read: Credit Card Rules: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. పెరిగిన ఛార్జీలు ఇలా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News