Sunil Gavaskar Makes Bold Prediction on Hardik Pandya: ఆస్ట్రేలియాపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 గెలుచుకున్న భారత్ మంచి జోష్ మీదుంది. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు ఆడేందుకు సిద్దమైంది. ముంబై వేదికగా మార్చి 17న మధ్యాహ్నం జరిగే తొలి వన్డేలో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆస్ట్రేలియాపై ఇప్పటికే టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్.. వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే తొలి వన్డేకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యాడు. దాంతో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలను అందుకోనున్నాడు. అయితే తొలి వన్డేలో భారత్ గెలిస్తే కెప్టెన్‌గా హార్దిక్ పేరు మారుమోగుతుందని మాజీ భారత ఓపెనర్ సునీల్ గవాస్కర్ అన్నాడు.
తొలి వన్డే నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మాటాడుతూ.. 'హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ కెప్టెన్సీకి నేను ఫిదా అయ్యా. గుజరాత్ టైటాన్స్, భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. ఆస్ట్రేలియాతో ముంబైలో జరిగే తొలి వన్డేలో భారత్ విజయం సాధిస్తే.. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం భారత కెప్టెన్‌గా హార్దిక్ పేరు బలంగా వినిపించడం ఖాయం. హార్దిక్ సారథ్యంలో ఆటగాళ్ల సౌకర్యంగా ఉంటున్నారు. ఆటగాళ్లను హ్యాండిల్ చేసే విధానం, వారికి అండగా ఉండటం వల్లనే.. ప్లేయర్స్ సహజిసిద్దమైన ఆటను ఆడుతున్నారు. సహచర ఆటగాళ్లను హార్దిక్ బాగా ప్రోత్సహిస్తున్నాడు. ఇది జట్టుకు శుభసూచకం' అని అన్నాడు.
ఐపీఎల్ 2022 ముందు వరకు హార్దిక్ పాండ్యా గాయాలతో సతమతమయ్యాడు. స్వయంగా జట్టు నుంచి తప్పుకొని ఫిట్‌నెస్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఫిట్‌నెస్ సాధించిన తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ 2022లో రీఎంట్రీ ఇచ్చి సత్తాచాటాడు. బ్యాటింగ్‌లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. బౌలింగ్‌లోనూ వికెట్స్ పడగొట్టాడు. కెప్టెన్సీలో దుమ్మురేపాడు. మొత్తంగా ఆల్‌రౌండర్‌గా గుజరాత్‌కు తొలి టైటిల్ అందించాడు. ఐపీఎల్ ప్రదర్శనతో టీమిండియా వన్డే వైస్ కెప్టెన్సీతో పాటు టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఇప్పుడు వన్డేలకు కెప్టెన్ అయ్యాడు.
Also Read: H3N2 Virus In India 2023: హెచ్3ఎన్2 ప్రభావం.. మార్చి 16 నుంచి 24 వరకు పాఠశాలలకు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి