IND Vs AUS Updates: తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో ఊహించని మార్పులు

India Vs Australia Toss and Playing 11: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ చాలా రోజుల తరువాత వన్డే ఆడనున్నాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 22, 2023, 01:47 PM IST
IND Vs AUS Updates: తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో ఊహించని మార్పులు

India Vs Australia Toss and Playing 11: ఆసియా కప్‌ గెలిచిన జోష్‌లో మరో సిరీస్‌కు భారత్ రెడీ అయింది. ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో నేడు తొలి వన్డేలో తలపడుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకోవడంతో కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా కూడా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌తో పాటు మిచెల్ స్టార్క్‌కు రెస్ట్ ఇచ్చింది. మొహలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కంగారూ టీమ్ బ్యాటింగ్ ఆరంభించనుంది. ఆసియా కప్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చాడు. మహ్మద్ సిరాజ్‌కు ఈ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వగా.. మహ్మద్ షమీని ప్లేయింగ్‌ 11లోకి తీసుకున్నారు. ఇక చాలా రోజుల తరువాత రవిచంద్రన్ అశ్విన్‌ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 

టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేస్తామని తెలిపాడు. ఇది మంచి ఛేజింగ్ పిచ్. మేము ఇంకా కొన్ని చోట్ల మెరుగవ్వాల్సి ఉందన్నాడు. వాటిని కరెక్ట్‌ చేసుకుని ముందుకు వెళతామని చెప్పాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు వారితో ఆడటం చాలా బాగుందన్నాడు. ఆసీస్ పోటీతత్వం ఉన్న టీమ్.. వారితో ఆడడాన్ని ఆస్వాదిస్తామన్నాడు. మంచి సవాల్ ఎదురుకానుందన్నాడు.

"భారత్‌కు తిరిగి రావడం బాగుంది. నేను ఇక్కడికి తిరిగి వచ్చి చాలా కాలమైంది. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ సిద్ధంగా లేరు. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాం. ఇక్కడ చక్కగా.. ఎండగా ఉంది. వార్నర్‌, మార్ష్‌లు బ్యాటింగ్‌ను ప్రారంభించనున్నారు. స్మిత్, మార్నస్, ఇంగ్లిస్ మిడిల్ ఆర్డర్లు ఆడనున్నారు.." అని ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తెలిపాడు.

తుది జట్లు ఇలా..

భారత్: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్/కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా.

Also Read: Best Affordable Mobiles: అమెజాన్‌లో 50MP కెమెరా కలిగిన మొబైల్‌ రూ.7,000 లోపే..పరిమిత కాలం డిస్కౌంట్‌ ఆఫర్స్‌!  

Also Read: iPhone 15 Sale: ఐఫోన్ 15 అమ్మకాలు షురూ.. ఎగబడి కొంటున్న జనం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News