Virat Kohli Eye on Rahul Dravids Most International Catches Record in India vs Australia 3rd Test: ప్రస్తుతం భారత గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాపై తొలి రెండు టెస్టులను గెలిచిన భారత్.. 2-0తో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో రేపు ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో కూడా గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023ని గెలుచుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచులో అయినా గెలవాలని ఆసీస్ భావిస్తోంది.
మూడో టెస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. మూడో టెస్ట్‌లో ఓ క్యాచ్ అందుకుంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 299 క్యాచ్‌లు పట్టాడు. ఇంకొక్క క్యాచ్ అందుకుంటే విరాట్ 300 క్యాచ్‌ల క్లబ్‌లో చేరుతాడు. దాంతో ఈ ఘనతను అందుకున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఈ జాబితాలో టీమిండియా హెడ్ కోచ్, మాజీ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ (334) అగ్రస్థానంలో ఉన్నాడు.
509 మ్యాచ్‌ల్లో రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్‌లు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 492 మ్యాచ్‌ల్లోనే 299 క్యాచ్‌లు పట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లకు పైగా అందుకున్న జాబితాలో కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే 440 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మాజీ ప్లేయర్స్ రికీ పాంటింగ్ (364), రాస్ టేలర్ (351), జాక్వస్ కల్లీస్ (338) అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్నారు.
మరోవైపు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ మరో 77 పరుగులు చేస్తే.. టెస్ట్‌ల్లో సొంతగడ్డపై 4వేల పరుగులు పూర్తి చేస్తాడు. ఇప్పటివరకు నలుగురు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (7216) అగ్ర స్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ (5598), సునీల్ గవాస్కర్ (5067), వీరేంద్ర సెహ్వాగ్ (4,656) కోహ్లీ కంటే ముందున్నారు.
Also Read: High Mileage SUVs: అత్యధిక మైలేజీనిచ్చే 6 ఎస్‌యూవీలు.. లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్లు!
Also Read: మార్చి 13 నుంచి మే 10 వరకు.. ఈ రాశి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి! లేదంటే అంతే సంగతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.