IND Vs AUS Prediction Today Match: ఆసీస్‌తో తొలిపోరుకు టీమిండియా సిద్ధం.. డ్రీమ్11 టీమ్ టిప్స్, స్ట్రీమింగ్ వివరాలు ఇలా..!

India vs Australia Dream11 Tips and Live Streaming Details: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వేన్డే సిరీస్‌ శుక్రవారం నుంచి షురూ కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా వంటి ప్లేయర్లు లేకుండా టీమిండియా తొలి రెండు వన్డేలు ఆడనుంది. మొహలీలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభకానుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 21, 2023, 11:36 PM IST
IND Vs AUS Prediction Today Match: ఆసీస్‌తో తొలిపోరుకు టీమిండియా సిద్ధం.. డ్రీమ్11 టీమ్ టిప్స్, స్ట్రీమింగ్ వివరాలు ఇలా..!

India vs Australia Dream11 Tips and Live Streaming Details: విశ్వకప్‌కు చివరి వన్డే సిరీస్‌కు భారత్ సిద్దమైంది. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. ఇటీవల ఆసియా కప్‌ గెలుచుకుని టీమిండియా ఉత్సాహంలో ఉండగా.. అటు ఆస్ట్రేలియా టీమ్ దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌ ఓడిపోయింది. ఈ సిరీస్‌ను నెగ్గి.. ప్రపంచకప్‌కు గెలుపు జోష్‌లో వెళ్లాలని రెండు జట్లు భావిస్తున్నాయి. మొహలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభకానుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? పూర్తి వివరాలు ఇవిగో..!

పిచ్ రిపోర్ట్ ఇలా..

మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బ్యాట్‌పై బంతి చక్కగా వస్తుంది. ఐపీఎల్‌లో ఈ పిచ్‌పై హైస్కోరింగ్ మ్యాచ్‌లే ఎక్కువగా జరిగాయి. అయితే గత నాలుగేళ్లుగా ఇక్కడ వన్డే మ్యాచ్‌ జరగలేదు. పిచ్ స్పిన్నర్ల కంటే పేసర్లకు కాస్త ఎక్కువగా సహకరిస్తుంది. చివరి ఐదు వన్డేల్లో పేసర్లు 43 వికెట్లు తీసుకుంటే.. స్పిన్నర్లు 22 వికెట్ల పడగొట్టారు. ఆరంభంలో పేసర్లకు సహకారం కాస్త తక్కువగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక్కడ రెండో బ్యాటింగ్‌ చేసిన జట్టుకు మంచి రికార్డులు లేవు. ఈ వికెట్‌పై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 320 పరుగులుగా ఉంది. వర్షం కురిసే అవకాశం లేదు. 

స్ట్రీమింగ్ వివరాలు ఇలా..

==> వేదిక: మొహలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం
==> స్ట్రీమింగ్ వివరాలు: స్పోర్ట్స్ 18 ఛానెల్‌లు, Sports18 1 SD, Sports18 1 HD ఛానెల్స్‌తోపాటు జియో సినిమా యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

తుది జట్లు ఇలా.. (అంచనా)

భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), తిలక్ వర్మ/వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా. 

డ్రీమ్ 11 టీమ్ ఇలా..

వికెట్ కీపర్లు: ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్

బ్యాట్స్‌మెన్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్

ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, మార్క్ స్టోయినిస్ 

బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్.

Also Read: Emergency Alert Message: మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? అసలు విషయం ఇదే..!

Also Read: Rahul Sipligunj: రతిక రోజ్‌తో పర్సనల్ పిక్స్‌పై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. గుట్టురట్టు చేసేశాడు..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News