IND vs AUS 4th Test Updates: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో వరుస రెండు విజయాలు సాధించిన టీమిండియాకు మూడో టెస్టులో ఆసీస్ షాక్ ఇచ్చింది. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 9 వికెట్ల తేడాతో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో విజయంతో కంగారూ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో తన ప్లేస్ ఫిక్స్ చేసుకుంది. సిరీస్ గెలవడంతో పాటు డబ్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్‌కు చివరి మ్యాచ్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తుది జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఇరు జట్లు ఈ నెల 9వ తేదీ నుంచి తలపడనున్నాయి.
రెండు మ్యాచ్‌లో విఫలమైన కేఎల్ రాహుల్‌ను మూడో టెస్టుకు దూరం పెట్టారు. రాహుల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ మరీ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో చివరి మ్యాచ్‌కు మళ్లీ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకునే యోచనలో మేనేజ్మెంట్ ఉంది. కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. గిల్ బెంచ్‌కే పరిమితమవుతాడు. సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వాలని అన్ని వైపులా నుంచి డిమాండ్ వస్తోంది.
ఆసీస్ స్పిన్నర్లు చెలరేగుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ దూకుడు బ్యాటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని మాజీలు అంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యను తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక వికెట్ కీపర్ కేఎస్ భరత్ విషయంలోనూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడు టెస్టుల్లోనూ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా భరత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కీపింగ్‌లో మెరుపులు మెరిపించినా.. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్న సమయాల్లో ఏ మాత్రం ఆదులేకపోయాడు. అదే రిషబ్ పంత్ ఉంటే జట్టు పరిస్థితి మరోలా ఉండేదని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నాలుగో టెస్టుకు భరత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మహ్మద్ షమీ చివరి టెస్టుకు ఫిట్ అయితే.. ఉమేశ్ యాదవ్ జట్టు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్/శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్/ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు
Also Read: Bandi Sanjay: పీఆర్సీ ఏర్పాటు చేయండి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి