IND vs AUS: ఆర్‌సీబీ కాదు..ఇది ఇండియా..అభిమానులపై విరాట్ కోహ్లీ అసంతృప్తి..!

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. రెండో మ్యాచ్‌ సందర్భంగా నాగ్‌పూర్ స్టేడియంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇవే..

Written by - Alla Swamy | Last Updated : Sep 24, 2022, 06:08 PM IST
  • రసవత్తరంగా టీ20 సిరీస్
  • రెండో మ్యాచ్‌లో భారత్ విజయం
  • ఈసందర్భంగా ఆసక్తికర ఘటన
IND vs AUS: ఆర్‌సీబీ కాదు..ఇది ఇండియా..అభిమానులపై విరాట్ కోహ్లీ అసంతృప్తి..!

IND vs AUS: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ..మైదానాల్లో చురుగ్గా కనిపిస్తుంటాడు. ఫీల్డింగ్‌లో గానీ, బ్యాటింగ్‌లో గానీ హుషారుగా ఉంటాడు. ఐతే అలాంటి రన్‌ మిషన్‌కు కోపం వచ్చింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈఘటన చోటుచేసుకుంది. మైదానంలో ఒక్కసారిగా అభిమానులపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిన్న నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా సిరీస్‌ను 1-1గా సమం చేసింది. 

మ్యాచ్‌ ముగిన తర్వాత కోహ్లీని చూస్తూ అభిమానులు కేరింతలు కొట్టారు. అతడిని చూస్తూ ఆర్‌సీబీ..ఆర్‌సీబీ అంటూ నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన రన్‌ మిషన్ ఇది టీమిండియా అనే అర్థం వచ్చేలా తన టీషర్ట్‌పై ఉన్న లోగోను అభిమానులకు చూపించాడు. ఈసందర్భంగా కోహ్లీ మొహంలో అసంతృప్తి కనిపించింది. ఈవీడియో విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. పోస్ట్ చేసిన కాసేపటికే వీడియో వైరల్‌గా మారింది. దీనిని నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. దట్ ఈజ్ కోహ్లీ అంటూ కొందరు మెసేజ్‌లు పెడుతున్నారు. 

Also read:Shikhar Dhawan: జడేజా వద్ద శిఖర్ ధావన్ సరికొత్త స్టెప్పులు..వైరల్‌గా రీల్ వీడియో..!

Also read:Bank Holidays October 2022: అక్టోబర్ నెలలో బ్యాంకుల సెలవు రోజులు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News