Wasim Jaffer praises Virat Kohlis 35 runs innings vs Pakistan: గత మూడేళ్ళుగా సరైన ప్రదర్శన చేయని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై గత కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆట నుంచి విరామం తీసుకోవాలనే అభిప్రాయాలు మాజీల నుంచి వచ్చాయి. ఈ క్రమంలోనే వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్ 2022లో బరిలోకి దిగాడు. నెల రోజులపైగా గ్యాప్ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ (35; 34 బంతుల్లో 3×4, 1×6) ఆడాడు. కోహ్లీ ఆట మునుపటిలా అనిపించింది. టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను మెచ్చుకున్నాడు.
148 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్‌పై మరో వికెట్ పడకుండా ఆడాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తడబడిన పిచ్‌పై చాల రోజుల తర్వాత బ్యాట్ పట్టిన విరాట్ పరుగులు చేశాడు. 35 రన్స్ చేసిన కోహ్లీ.. మహమ్మద్ నవాజ్ వేసిన బంతికి లాంగాఫ్‌లో ఇఫ్తికార్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ఓ క్రీడా ఛానెల్‌తో వసీం జాఫర్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ చేసిన 35 పరుగులు చాలా విలువైనవి. కోహ్లీ పరుగులు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపాయి. 170 లేదా 180 కాకుండా.. 148 పరుగుల ఛేదనలో బ్యాటింగ్ లైనప్ కుప్పకూలితే తప్ప ఏ జట్టయినా గెలుస్తుంది. కాబట్టి కోహ్లీ చేసిన 35 పరుగులు చాలా విలువైనవి. విరామం తర్వాత ఆడిన ఈ ఇన్నింగ్స్ ఆశలు రేపుతుంది. ఆసియా కప్ 2022లో కచ్చితంగా కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడు' అని అన్నాడు.
'సాధారణంగా ఇలాంటి లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ నుంచి 60-70 పరుగులు ఆశిస్తాం. పాకిస్తాన్‌పై కోహ్లీ రికార్డు బాగుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. ఇప్పుడు విరాట్ ఆడిన ఇన్నింగ్స్ చాలా విలువైంది' అని వసీం జాఫర్ పేర్కొన్నారు. కోహ్లీ తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అయితే పాక్ మ్యాచులో కోహ్లీ తొలి బంతికే ఔట్ అయ్యేవాడు. అయితే విరాట్ ఇచ్చిన క్యాచ్ స్లిప్స్‌లో ఉన్న ఫఖర్ జమాన్ అందుకోలేకపోయాడు.
Also Read: Viral Video: రైలుకి ఎదురెళ్లిన యువతి.. హారన్ కొడుతున్నా పట్టించుకోలేదు! ఇంతలోనే..
Also Read: జాతీయ క్రీడా దినోత్సవం.. మనలో ఆత్మవిశ్వాసం నింపి జోష్‌నిచ్చే బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి