IND vs SA1st T20I: భారత్‌దే బ్యాటింగ్.. యువ పేసర్లకు నిరాశే! టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్‌

IND vs SA 1st T20I Playng XI Out: Rishabh Pant sets new record as a Captain. మరోకొద్ధి సేపట్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2022, 07:10 PM IST
  • తొలి టీ20 మ్యాచుకు కెప్టెన్‌గా పంత్
  • టీమిండియాదే బ్యాటింగ్.. యువ పేసర్లకు నిరాశే
  • అవేశ్ ఖాన్‌కు తుది జట్టులో చోటు
IND vs SA1st T20I: భారత్‌దే బ్యాటింగ్.. యువ పేసర్లకు నిరాశే! టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్‌

IND vs SA 1st T20I Playng XI Out, Dinesh Karthik and Avesh Khan in: సొంతగడ్డపై భారత జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మరోకొద్ధి సేపట్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో చోటు ఆశించిన ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్‌లకు నిరాశే ఎదురైంది. దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా లాంటి స్టార్ ప్లేయర్లు ఈ పొట్టి సిరీస్‌కు అందుబాటులో లేరు. ఇక సిరీస్ ఆరంభానికి ముందు కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. రాహుల్‌ గైహాజరీలో రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.

తొలి టీ20కి రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఎంపికవ్వడంతో ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అతి చిన్న వయసులో భారత జట్టు టీ20 సారథ్య బాధ్యతలు అందుకున్న రెండో ఆటగాడిగా పంత్ నిలిచాడు. 24 ఏళ్ల వయస్సులో పంత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అతి తక్కువ వయసులో టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన ఆటగాడిగా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా తొలి స్థానంలో ఉన్నాడు. రైనా 23 సంవత్సరాల 197 రోజుల వయసులో కెప్టెన్ అయ్యాడు.

తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్, అవేష్ ఖాన్. 
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్ ), తెంబా బావుమా( కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, అన్రిచ్ నోర్జ్. 

Also Read: Ante Sundaraniki OTT: 'అంటే సుందరానికి' సినిమా ఓటీటీ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?

Also Read: Nayanthara Vignesh Shivan Wedding Pics: ఒక్కటైన నయన్‌-విఘ్నేశ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News