Rishabh Pant survives from run-out chance after Kagiso Rabada dash: టీమిండియాతో ఉత్కంఠగా సాగిన తొలి టీ20 మ్యాచులో దక్షిణాఫ్రికా బోణి కొట్టింది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యంను మరో 5 బంతులు మిగిలి ఉండగానే సఫారీ జట్టు చేధించింది. లక్ష్యం కష్టమే అనుకుంటున్న సమయంలో డేవిడ్ మిల్లర్ (64 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), వాన్‌డెర్ డసెన్ (75 నాటౌట్; 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాకు అద్భుత విజయాన్ని అందించారు. ఐదు మ్యాచుల టీ20 సిరీసులో సఫారీలు ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉన్నారు.
ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ (29; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పర్వాలేదనిపించాడు. అయితే తొలి టీ20 మ్యాచులో పంత్ డైమండ్ డకౌట్ అయ్యేవాడు. ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరిన అనంతరం పంత్ క్రీజులోకి వచ్చాడు. 14వ ఓవర్ మొదటి బంతిని కాగిసో రబాడ వేయగా.. శ్రేయాస్ అయ్యర్ ఎదుర్కొన్నాడు. బంతిని లెగ్ సైడ్ డిఫెన్స్ చేయగా.. అది కాస్త షార్ట్ మిడ్-వికెట్‌లోకి దూసుకెళ్లింది. రన్ కోసం పంత్ పరుగెత్తగా.. బౌలింగ్ చేసిన రబాడ అతడిని ఢీ కొట్టాడు. కిందపడబోయిన భారత కెప్టెన్ బ్యాలెన్స్ చేసుకుని వెనక్కి వచ్చేశాడు.
రిషబ్ పంత్ క్రీజులోకి రాకముందే ప్రొటీస్ ఫీల్డర్ ట్రిస్టియన్ స్టబ్స్ డైరెక్ట్ హిట్‌వేయగా అదికాస్తా వికెట్లను దూరంగా వెళ్ళింది. దాంతో పంత్ డైమండ్ డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ డైరెక్ట్ హిట్ అయితే పంత్ తన కెప్టెన్సీ అరంగేట్రంలోనే డకౌట్ అయ్యేవాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'బంతి వికెట్లను తగిలితే.. గురుడు డైమండ్ డకౌటే' అని ఒకరు కామెంట్ చేయగా.. 'రబాడ ఫెయిర్ ప్లే పాయింట్లు కట్ చేయండి సార్'అం ఇంకొకరు ట్వీటారు.
— RohitKohliDhoni (@RohitKohliDhoni) June 9, 2022
టీ20 సిరీస్ ఆరంభానికి ముందు కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. రాహుల్ గైహాజరీలో రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. తొలి ఓటమిపై స్పందించిన పంత్.. తమ బ్యాటింగ్ ప్రదర్శన బాగుందన్నారు. బౌలింగ్‌లో తేలిపోయామని, వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించిందని చెప్పుకొచ్చాడు.
Also Read: Palmistry Govt Job Line: మీ అర చేతిలో ఈ రేఖ ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగం పక్కా! ఉన్నత పదవి కూడా
Also Read: Kane Williamson Covid: కేన్ విలియమ్సన్‌కు కరోనా.. రెండో టెస్టు నుంచి అవుట్! కెప్టెన్ ఎవరంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook