IND vs SA 1st T20I Weather Forecast: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న టీమిండియా మరో సమరానికి సిద్దమైంది. సొంతగడ్డపైనే దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లను భారత్ ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరగనుంది. ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది.
నేడు మ్యాచ్ జరిగే తిరువనంతపురంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నేడు మైదానాన్ని మబ్బులు కమ్మే అవకాశం ఉందని, వర్షం రావడానికి 50 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉందని పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో కూడా జల్లులు పడే అవకాశముందట. దాంతో మ్యాచ్ సజావుగా సాగడం కష్టమే. గత రెండు రోజులుగా కేరళలో వాతావరణం చల్లగా మారింది. మంగళవారం అక్కడ వర్షం పడింది.
గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో ఇప్పటివరకు రెండు టీ20లే జరిగాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి ముందు బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా.. మరో మ్యాచ్ చేజింగ్ టీమ్ గెలిచింది. ఒక టీ20లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 170కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఇంకో మ్యాచ్ 8 ఓవర్ల పాటే సాగింది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఇక భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు 19 మ్యాచ్‌ల్లో తలపడగా.. టీమిండియా 11 మ్యాచ్‌లు గెలిచింది.
భారత్ బ్యాటింగ్ బాగున్నా.. డెత్ ఓవర్లలో బౌలింగ్ పెద్ద సమస్యగా మారింది. ఈ సిరీస్‌తోనైనా ఆ సమస్యను రోహిత్ సేన అధిగమించాలని జట్టు భావిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా జతగా దీపక్ చహర్, అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులో ఉంటే భారత్ బౌలింగ్ పటిష్టం కానుంది. మరోవైపు బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు కూడా బలంగానే ఉంది. సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై భారత్ పైచేయి సాధించలేదు. ప్రపంచకప్ 2022లో ఈ రెండు జట్లు గ్రూప్ దశలో పోటీపడనున్నాయి. కాబట్టి ఇరు జట్లు తమ బలాబలాను పరీక్షించుకోనున్నాయి.
Also Read: Chhattisgarh Crime: నల్లగా ఉన్నావన్నందుకు.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య..
Also Read: IND VS SA: తొలి టీ20 నేడే... సఫారీలతో పోరుకు సిద్దమైన భారత్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook