India vs South Africa Live Score, 1st Test, Day 1: సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మధ్యాహ్నం 1 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా.. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఔట్‌ఫీల్డ్ తడి కారణంగా ఆలస్యమైంది. దీంతో టాస్ మధ్యాహ్నం 1.45 గంటలకు వేశారు. ఆట మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుంది. గాయం కారణంగా టీమిండియా ఆల్ రౌండర్ జడేజా ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా ప్రసిద్ కృష్ణ టెస్టుల్లో ఆరంగ్రేటం చేయనున్నారు.
సఫారీ గడ్డపై ఇప్పటి వరకు భారత్ టెస్టు సిరీస్ గెలిచింది లేదు. 1996 నుండి టీమిండియా దక్షిణాఫ్రికాలో 23 టెస్టులు ఆడింది. అయితే కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్‌ల తర్వాత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే అదే భారత్. కేఎల్ రాహుల్ తొలిసారి టెస్టుల్లో కీపింగ్ చేయనున్నాడు. అయితే జడేజా స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో ప్రసిద్ధ్ కృష్ణ మూడో పేసర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. కెప్టెన్ రోహిత్ తో కలిసి యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు.
టీమిండియా ప్లేయింగ్ XI:
రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
సౌతాఫ్రికా ప్లేయింగ్ XI:
డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా(సి), కీగన్ పీటర్‌సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రేన్నే(w), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడా, నాండ్రే బర్గర్
Also Read: MS Dhoni-Pant: శాంతాక్లాజ్ దుస్తుల్లో మెరిసిన ధోనీ, పంత్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook