Ishan Kishan reacts about rotating the strike: తనలా కొంతమంది సిక్స్‌లు కొట్టలేరని, సిక్సర్లు కొట్టడం బలం అయినప్పుడు స్ట్రైక్ రొటేట్ ఎందుకు చేయాలని టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ అన్నాడు. కొందరికి స్ట్రైక్ రొటేట్ చేసే బలం ఉంటుందని, మరికొందరికి భారీ షాట్లు కొట్టడంలో బలం ఉంటుందన్నాడు. మైదానంలోని తప్పులను విశ్లేషించి ఇంకా మెరుగ్గా ఎలా ఆడాలో నేర్చుకుంటానని ఇషాన్ కిషన్ చెప్పాడు. దక్షిణాఫ్రికాతో రాంచి వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో ఇషాన్ (93; 84 బంతుల్లో 4×4, 7×6) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ... 'ప్లేయర్స్ ఎప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నేను కూడా అంతే. మైదానంలోని తప్పులను విశ్లేషించి ఇంకా మెరుగ్గా ఎలా ఆడాలో నేర్చుకుంటా. రెండో వన్డేలో సెంచరీ చేజార్చుకున్నా. జట్టు పరంగా చూస్తే మాత్రం 93 పరుగులు మంచి స్కోరే. అయితే సెంచరీకి దగ్గరలో ఔట్ కావడం బాధాకరమే. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. తప్పకుండ శతకం అందుకుంటా' అని అన్నాడు.
'కొందరు ఆటగాళ్లకు స్ట్రైక్ రొటేట్ చేసే బలం ఉంటుంది. మరికొందరికి భారీ షాట్లు కొట్టడంలో బలం ఉంటుంది. సిక్సర్లు కొట్టడం నా బలం. నాలా కొంతమంది సిక్స్‌లు కొట్టలేరు. అలాంటప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయడం గురించి నేను పెద్దగా ఆలోచించను. కొన్ని సందర్భాల్లో స్ట్రైక్ రొటేట్ చేసే అవసరం ఉంటుంది. అయితే నా బలం సిక్స్‌లు కొట్టడమే కాబట్టి.. నాకు నేను స్ట్రైక్ రొటేట్ చేసుకునేలా బలవంతం చేసుకోను. ఈ మ్యాచులో నేను సెంచరీకి ఏడు పరుగుల దూరంలో ఉన్నాను. ఆ సమయంలో సింగిల్స్‌తో శతకం పూర్తి చేయలేను. నేను దేశం కోసం ఆడుతున్నా. నా వ్యక్తిగత పరుగుల కోసం ఆలోచిస్తే అభిమానులను నిరాశపరిచినట్లే' అని ఇషాన్ చెప్పాడు.
Also Read: Shraddha Kapoor Pics: శ్రద్ధా కపూర్ హాట్ ట్రీట్.. ఎంత శ్రద్దగా అందాలను చూపిస్తుందో!
Also Read: వివాదంలో నయనతార 'అమ్మతనం'.. అలా ఎలా అంటూ నోటీసులు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook